రికార్డుల వేటలో ధురంధ‌ర్2.. ఇక ఆపేది ఎవరు?

ఈ అరుదైన ఘనత సాధించిన సినిమాల లిస్ట్ లో గ‌ద‌ర్2, జ‌వాన్, స్త్రీ2, ఛావా మ‌రియు ధురంధ‌ర్ మొద‌టి భాగం మాత్ర‌మే ఉండ‌గా, ఇప్పుడా లిస్ట్ లోకి ధురంధ‌ర్2 చేర‌డం గ‌మ‌నార్హం.;

Update: 2026-04-01 07:54 GMT

బాలీవుడ్‌లో భారీ సంచలనంగా మారిన ధురంధ‌ర్2 ఇప్పుడు కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, ఫుట్‌ఫాల్స్ పరంగానూ కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్లకు పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించడం విశేషం. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిందనే అభిప్రాయాన్ని ఇది సవాల్ చేస్తోంది.

టాప్ లో పుష్ప2

ఈ అరుదైన ఘనత సాధించిన సినిమాల లిస్ట్ లో గ‌ద‌ర్2, జ‌వాన్, స్త్రీ2, ఛావా మ‌రియు ధురంధ‌ర్ మొద‌టి భాగం మాత్ర‌మే ఉండ‌గా, ఇప్పుడా లిస్ట్ లోకి ధురంధ‌ర్2 చేర‌డం గ‌మ‌నార్హం. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఫుట్‌ఫాల్స్ రేస్‌ను పరిశీలిస్తే, ప్రస్తుతం పుష్ప‌2 సినిమా సుమారు 4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో టాప్‌లో ఉంది. అయితే ధురంధ‌ర్2 ఫుల్ రన్ పూర్తయ్యే నాటికి 5 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది సాధ్యమైతే, హిందీ మార్కెట్ మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ సినిమా కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసే అవకాశం ఉంది.

రీబౌండ్ అయిన ర‌ణ్‌వీర్‌

ధురంధ‌ర్ ఫ్రాంచైజ్ స‌క్సెస్ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇదే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఈ సినిమా ఒక భారీ రీబౌండ్‌గా మారింది. స్టార్ పవర్ ఇంకా బలంగానే ఉందని, సరైన కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారని ఈ సినిమా నిరూపించింది. డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ విషయంలో కూడా ఇదొక మైలురాయి స‌క్సెస్‌గా చెప్పాలి. ధురంధ‌ర్ ఫ్రాంచైజ్‌ను ప్లాన్ చేసిన విధానం, కథనం నిర్మాణం, మాస్ మరియు ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు ఈ స‌క్సెస్ కు మెయిన్ రీజ‌న్స్ గా కనిపిస్తున్నాయి. రెండు భాగాలు కలిపి 8 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడవడం ఇండియన్ సినీ హిస్ట‌రీలోనే అరుదైన ఘనతగా నిలుస్తోంది.

సెకండ్ వీక్ లో రూ.170 కోట్ల వ‌సూళ్లు

ఇక కలెక్షన్ల పరంగా కూడా ధురంధ‌ర్2 తన దూకుడు కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్‌లో కూడా ఈ సినిమా రూ. 170 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు సాధించడం ద్వారా ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ సెకండ్ వీకెండ్ గ్రాసర్‌గా నిలిచింది. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఫైనల్ రన్‌లో సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, టికెట్ సేల్స్ మరియు కలెక్షన్స్ రెండింటి పరంగా కూడా ధురంధ‌ర్2 ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఇది 5 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను దాటితే, ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత స‌క్సెస్ అయిన సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.

Tags:    

Similar News