రొటీన్ సినిమాల‌తో ఈ హీరోలిద్ద‌రూ దొందూ దొందే!

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ లీడ్ రోల్‌లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ `ఢమాల్ 4` బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని గౌరవప్రదమైన వసూళ్లతోనే ప్రారంభించింది.

Update: 2026-07-12 00:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ లీడ్ రోల్‌లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ `ఢమాల్ 4` బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని గౌరవప్రదమైన వసూళ్లతోనే ప్రారంభించింది. బాక్సాఫీస్ లెక్క‌ల్ని వివ‌రించే సాక్‌నిల్క్ సంస్థ ఒక అంచ‌నా వేయ‌గా.. ఢ‌మాల్ 4 తొలి రోజు భార‌త‌దేశంలో 13.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 10వేలు పైగా షోలతో విడుదలైన ఈ సినిమా అజయ్ దేవగన్ ఇటీవలి కొన్ని చిత్రాల ఓపెనింగ్స్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

ఢ‌మాల్ 4 మొదటి రోజు 13.75 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఫ్రాంచైజీలో గతంలో వచ్చిన `టోటల్ ఢమాల్` రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. 2019లో విడుదలైన `టోటల్ ఢమాల్` చిత్రం మొదటి రోజే 16.5 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. అలాగే ఇటీవల విడుదలైన మరో మల్టీస్టారర్ కామెడీ మూవీ `వెల్‌కమ్ టు ది జంగిల్` పెయిడ్ ప్రివ్యూలతో కలిపి మొదటి రోజు 19 కోట్లు రాబట్టింది. ఓపెనింగ్స్ కలెక్షన్ల రేస్‌లో కూడా `ఢమాల్ 4` కాస్త వెనుకబడింది.

ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఫ్రాంచైజీలో నాల్గవ భాగంగా వ‌చ్చింది. టి-సిరీస్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, మారుతి ఇంటర్నేషనల్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫేరిలతో పాటు రవి కిషన్, సంజయ్ మిశ్రా, ఉపేంద్ర లిమాయే, అంజలి ఆనంద్, సంజీదా షేక్, ఇషా గుప్తా , విజయ్ పట్కర్ వంటి భారీ తారాగణం నటించారు.

గత భాగాల మాదిరిగానే ఈ సినిమా కథ కూడా నిధి అన్వేషణ చుట్టూనే తిరుగుతుంది. మొదటి భాగంలో గంద‌ర‌గోళ కామెడీ ఈ భాగంలోను కొన‌సాగింది. అర్షద్ వార్సి, రితేష్ దేశ్‌ముఖ్, సంజయ్ మిశ్రాల కామెడీ టైమింగ్ బాగుందని కొందరు ప్రశంసిస్తుండగా... స్క్రీన్‌ప్లే అంతగా బాగోలేదని.. సినిమాలో వాడిన ఏఐ విజువల్స్ నాసిరకంగా ఉన్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు.

అయితే ఇటీవ‌ల వ‌చ్చిన `వెల్ కం టు ద జంగిల్` త‌ర‌హాలోనే `ఢ‌మాల్ 4` చిత్రానికి కూడా మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆరంభం గంద‌ర‌గోళ గ‌జిబిజి కామెడీ అంటూ విమ‌ర్శలు వ‌చ్చాయి. అక్ష‌య్ కుమార్, దిశా ప‌టానీ, సంజ‌య్ ద‌త్, లారా దత్తా లాంటి భారీ తారాగ‌ణం న‌టించిన `వెల్ కం టు ది జంగిల్` ఊహించ‌ని రీతిలో భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ ఇది ఊహించ‌నిది. ఇప్పుడు దేవ‌గ‌న్ కూడా అలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడా? అనే చ‌ర్చ మొద‌లైంది. `ఢ‌మాల్ 4` ఓపెనింగుల‌కు ఢోఖా లేదు. అయితే సోమ‌వారం నుంచి అస‌లు టెస్ట్ మొద‌ల‌వుతుంది. నాశిర‌కం విజువ‌ల్స్ అంటూ చాలా మంది తిడుతున్నారు కాబ‌ట్టి వెల్ కం టు ది జంగిల్ ఫీట్ ని దేవ‌గ‌న్ సినిమా రిపీట్ చేయ‌డం సాధ్య‌మా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News