దేవయానికి బిగ్ ఛాన్స్.. క్లిక్ అయితే తిరుగేలేదేమో..
టాలీవుడ్ లో మంచి ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్న నార్త్ బ్యూటీ దేవయాని శర్మకు ఇప్పుడు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ దక్కినట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్ లో మంచి ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్న నార్త్ బ్యూటీ దేవయాని శర్మకు ఇప్పుడు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ దక్కినట్లు కనిపిస్తోంది. ఓటీటీ ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె, ఇప్పుడు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అప్ కమింగ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఛాన్స్ ఆమె కెరీర్ కు గేమ్ ఛేంజర్ గా మారే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
అయితే ఢిల్లీకి చెందిన దేవయాని శర్మ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైన ఆమె, తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే వెబ్ సిరీస్ ల రేంజ్ ను దాటి సినిమాల్లోనూ మంచి ప్లేస్ సొంతం చేసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో వెంకటేష్- త్రివిక్రమ్ వంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం రావడం విశేషంగా మారింది.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆదర్శ కుటుంబం (AK47) చిత్రంలో దేవయాని శర్మ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టుకు రెస్పాండ్ అవుతూ ఆమె ఆ ప్రాజెక్టులో భాగమైన విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ లో కూడా జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
సినిమాలో ఆమె రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని, కథలో కీలక ట్విస్టులకు కారణమయ్యే పాత్రగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే దేవయానికి తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు పెద్ద ఛాన్స్ దక్కినట్లే. ముఖ్యంగా సినిమాలో తన రోల్ లో యాక్టింగ్ తో మెప్పిస్తే ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఆ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు దేవయాని శర్మ నటించిన సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. జూన్ 19వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఆ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం వెంకటేష్- త్రివిక్రమ్ సినిమాలోని ఆమె రోల్ పైనే ఉంది. ఆ ఛాన్స్ ను దేవయాని యూజ్ చేసుకుని తన యాక్టింగ్ తో అదరగొడితే, సినిమా కూడా భారీ విజయం సాధిస్తే టాలీవుడ్ లో ఆమెకు తిరుగుండదనే అభిప్రాయం వినిపిస్తోంది.