సోష‌ల్ మీడియా పోస్టుల‌తోనే కోట్లు కొల్ల‌గొడుతున్న దీపిక‌!

తన గ్లామర్, క్రేజ్‌తో టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ.. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్ రంగంలో అత్యధిక ఆదాయం ఆర్జించే అగ్రశ్రేణి భారతీయ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది.

Update: 2026-07-11 23:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కేవలం వెండితెర క‌థానాయిక‌గానే కాదు.. డిజిటల్ ప్రపంచంలోనూ తన సత్తా చాటుతోంది. ఇన్ స్టా, ఎక్స్ వంటి వేదిక‌ల‌పై ఎంతో యాక్టివ్ గా ఉండే దీపిక ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను రాణిస్తోంది. అదే స‌మ‌యంలో ప్ర‌ముఖ కార్పొరెట్ బ్రాండ్లు అయిన‌ నైకా, హిల్టన్, మెటా ఏఐ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ సోషల్ మీడియా వేదికగా భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తన గ్లామర్, క్రేజ్‌తో టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ.. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్ రంగంలో అత్యధిక ఆదాయం ఆర్జించే అగ్రశ్రేణి భారతీయ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది.

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏదైనా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి లేదా ఒక స్పాన్సర్డ్ పోస్ట్ పెట్టడానికి దీపికా పదుకొనే దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ సదరు బ్రాండ్ మరింత విస్తృతంగా ప్రచారం కావాలని కోరుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కలిపి జాయింట్‌గా పోస్ట్ చేయడానికి దీపిక‌ ఏకంగా 2.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. దీపిక‌కు ఉన్న మిలియ‌న్ల ఫాలోయింగ్ కారణంగా బ్రాండ్లు కూడా ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడటం లేదు.

సోషల్ మీడియా యాడ్ పోస్టింగుల ద్వారా దీపికా పదుకొనేకు ప్రతి నెలా కోట్లలో ఆదాయం సమకూరుతోంది. నెలకు కనీసం 2 నుండి 3 బ్రాండ్ పోస్టుల ద్వారా నెలవారీ ఆదాయం 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన కేవలం సోషల్ మీడియా ప్రమోషన్లు, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ద్వారానే దీపిక‌ ఏడాదికి దాదాపు 50 కోట్ల నుండి 70 కోట్ల వరకు ఏడాది పొడ‌వునా పోస్టింగులు చేస్తూ అత్యంత భారీ మొత్తాన్ని సంపాదిస్తూ డిజిటల్ మార్కెట్‌లో తన బ్రాండ్ వాల్యూను నిరూపించుకుంటోంది.

మరోవైపు సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ చిత్రాలతో పాటు గ్లోబల్ ప్రాజెక్టులలో నటిస్తున్న దీపికా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `రాకా` కోసం కూడా ఇదే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దీపిక‌ దాదాపు 20 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

నటనతో పాటు బిజినెస్ ఉమెన్‌గానూ రాణిస్తున్న దీపికా పదుకొనే తన సొంత సెల్ఫ్-కేర్ బ్రాండ్ 82°ఇను విజయవంతంగా నడుపుతోంది. అంతేకాకుండా యువ ప్రతిభను ప్రోత్సహించడానికి `క్రియేట్ విత్ మీ - ఆన్‌సెట్ ప్రోగ్రామ్` వంటి సరికొత్త డిజిటల్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మూడు నెలల పాటు కఠినమైన వడపోత ప్రక్రియ ద్వారా ప్రతిభావంతులను ఎంపిక చేస్తూ.. అటు కమర్షియల్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూనే ఇటు సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఉపయోగపడే సరికొత్త సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.

Tags:    

Similar News