ఈ సారి సినిమా సంక్రాంతి డిసెంబ‌ర్ నుంచే?

సంక్రాంతి సీజన్ అంటేనే భారీ సినిమాల జాతర కలెక్షన్ల సునామీకి అడ్డా. అయితే ఈసారి సంక్రాంతి వాతావరణం నెల రోజుల ముందే డిసెంబర్ నెలలోనే వ‌చ్చేస్తుంది.

Update: 2026-08-31 09:30 GMT

సంక్రాంతి సీజన్ అంటేనే భారీ సినిమాల జాతర కలెక్షన్ల సునామీకి అడ్డా. అయితే ఈసారి సంక్రాంతి వాతావరణం నెల రోజుల ముందే డిసెంబర్ నెలలోనే వ‌చ్చేస్తుంది . టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి ఒకే నెలలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలను బరిలోకి దిగ‌డంతో? డిసెంబర్ మాసం సినిమా ప్రియులకు గొప్ప వినోద విందును అందించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తోన్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' విడుదలవుతుంది.

ప్రభాస్ మార్కెట్ స్టామినా హను పీరియాడిక్ విజన్‌ల కాంబోలో వ‌స్తోన్న‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను న‌మోదు చేస్తుంద‌ని అంతా భావిస్తున్నారు. అలాగే భారతీయ చిత్రాలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే హాలీవుడ్ భారీ ప్రాజెక్టులు కూడా ఈ రేసులో నిలుస్తున్నాయి. గ్లోబల్ సెన్సేషన్స్ అయిన 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డ్యూన్: పార్ట్ 3' చిత్రాలు డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమ‌వుతున్నాయి.

భారత్‌లో కూడా హాలీవుడ్ సినిమాలకు భారీ మార్కెట్ ఉండటంతో ఈ చిత్రాల రాక ఇండియన్ బాక్సాఫీస్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చనుంది. ఇక డిసెంబర్ 24 ముక్కోణపు పోటీకి వేదిక కాబోతోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ - బాలీవుడ్ బాద్‌షా ఒకే రోజు థియేటర్ల వ‌ద్ద సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం 'కింగ్ 100' తో పాటు, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'NBK 111' చిత్రం, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ న‌టిస్తోన్న భారీ చిత్రం 'కింగ్' ఒకే రోజున విడుదల కానున్నాయి.

ఒకే రోజున ముగ్గురు అగ్ర కథానాయకుల చిత్రాలు పోటీపడటం అనేది థియేటర్ల కేటాయింపు, స్క్రీన్స్ లభ్యత పరంగా డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాలుగా మారనుంది. నాగార్జునకు డిసెంబర్ నెల సెంటిమెంట్‌గా కలిసిరావడం, బాలయ్య మాస్ స్టామినా , షారూఖ్ ఖాన్ ఓవర్సీస్ అండ్ నార్త్ మార్కెట్ క్రేజ్ నడుమ కలెక్షన్ల షేరింగ్ ఏ విధంగా ఉంటుందోనని ట్రేడ్ వర్గాలు ఉత్కంఠ నెల‌కొంది.

మొత్తానికి క్రిస్మస్ -న్యూ ఇయర్ సెలవుల కాలాన్ని క్యాష్ చేసుకోవడానికి అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఒకేసారి క్యూ కట్టడంతో 2026 డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రకు వేదిక కానుంది. సంక్రాంతికి ముందే రాబోతున్న డిసెంబర్ క్లాష్ లో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలుస్తుందో? ఏ హీరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకుంటారో? వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News