కాక్‌టైల్ 2 ట్రైలర్ టాక్.. బోల్డ్ కంటెంట్ తో ఇలా..

బాలీవుడ్ లో కాక్‌టైల్ సినిమాకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. దానికి సీక్వెల్ గా కాక్‌టైల్ 2 రాబోతోంది. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు

Update: 2026-06-02 13:07 GMT

బాలీవుడ్ లో కాక్‌టైల్ సినిమాకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. దానికి సీక్వెల్ గా కాక్‌టైల్ 2 రాబోతోంది. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది పక్కా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో హీరో షాహిద్ కపూర్ వాయిస్ ఓవర్ తో అసలు కథేంటో హింట్ ఇచ్చారు. కొత్త బంధం ఎప్పుడూ ఎక్సైటింగ్ గా ఉంటుంది.. ఎందుకంటే దానికి గతం ఉండదు అనే డైలాగ్ తో కాన్సెప్ట్ ఓపెన్ అవుతుంది.

కునాల్ గా షాహిద్, అల్లీ గా కృతి, దియా గా రష్మిక క్యారెక్టర్లను పరిచయం చేసిన తీరు బాగుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోకి ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందనే పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ లో బోల్డ్ సీన్స్, డైలాగ్స్ గట్టిగానే దట్టించారు. రోడ్ ట్రిప్స్, పార్టీలతో పాటు కృతి సనన్ గ్లామర్ షాట్స్, హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్స్ స్క్రీన్ పై హైలైట్ అవుతున్నాయి. అలాగే 'ముగ్గురు కలిసి రొమాన్స్' లాంటి బోల్డ్ డైలాగ్స్ తో యూత్ అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేశారు.

ఫరెవర్ అనే కాన్సెప్ట్ బక్వాస్ అంటూ రిలేషన్ షిప్స్ మీద ఈ తరం ఆలోచనలను డైలాగ్స్ రూపంలో చాలా ఓపెన్ గా చెప్పారు. గ్లామర్ డోస్ విషయంలో ఏమాత్రం తగ్గలేదని ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా ఫ్రెండ్ షిప్, లవ్ మధ్య వచ్చే ఎమోషనల్ క్లాష్ ను కూడా బ్యాలెన్స్ చేశారు. ఒక ఎక్స్ పైరీ డేట్ తర్వాత మందు కూడా విషం అవుతుంది అనే డైలాగ్ స్టోరీలోని డెప్త్ ను చెప్తుంది. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు రిలేషన్ లో ఉంటే ఆ ఫ్రెండ్ షిప్ ఎలా డ్యామేజ్ అవుతుందనే కోణాన్ని ఇక్కడ డీల్ చేసినట్లు తెలుస్తోంది.

నమ్మకం బ్రేక్ అయినప్పుడు క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ ను ట్రైలర్ లో బాగానే ఎలివేట్ చేశారు. డైరెక్టర్ హోమీ అదాజానియా టేకింగ్ ఫ్రేమ్స్ లో రిచ్ గా కనిపిస్తోంది. యూరప్ లొకేషన్స్, బీచ్ పార్టీలు సినిమా గ్రాండియర్ ను పెంచాయి. కృతి బోల్డ్ యాటిట్యూడ్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వగా, రష్మిక కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ లో ప్లే చేస్తోంది.

ఇక షాహిద్ నేను సాధారణ వజ్రాన్ని కాదు, కోహినూర్ ని అంటూ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ప్రీతమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పంజాబీ బీట్స్ ట్రైలర్ కు ఫుల్ ఎనర్జీని ఇచ్చాయి. ఇలాంటి రొటీన్ పాయింట్ ను డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో కొత్తగా ప్రజెంట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. దినేష్ విజన్, లవ్ రంజన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ జూన్ 19న థియేటర్లలోకి రాబోతోంది. పాత కాక్‌టైల్ సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ ను ఈ కొత్త టీమ్ రిపీట్ చేస్తుందా అనేది చూడాలి.


Full View


Tags:    

Similar News