ఫ్యూరియస్ డాన్ 'రేవంత్'.. 'హై' కూడా హిట్ అయితే..!
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రేవంత్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతార్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రేవంత్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతార్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. 'హై' సినిమాలో రేవంత్ ఫ్యూరియస్ డాన్ రోల్ లో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా నేడు రేవంత్ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. అందరినీ మెప్పిస్తోంది కూడా.
అయితే అనన్య శర్మ, ఎస్. కృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'హై' చిత్రానికి ఎస్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై ఆ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ను హీరో వెంకటేశ్ విడుదల చేయగా, యూత్ ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తోంది. ఇక టీజర్ లో రేవంత్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పటి వరకు అమాయకమైన, కామెడీ రోల్స్ లో కనిపించిన రేవంత్, ఈసారి మాస్ టచ్ ఉన్న పవర్ ఫుల్ డాన్ పాత్రలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. చిన్న వయసులోనే యాక్షన్ షేడ్స్ ఉన్న పాత్రను ఎలా డీల్ చేయగలడన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే సయంలో రేవంత్ కెరీర్ ను పరిశీలిస్తే, చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు రోల్ లో అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఆ పాత్రలో కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, సహజమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి దర్శకులు కూడా అతనికి ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు హై' సినిమాతో రేవంత్ మరోసారి తన యాక్టింగ్ లోని కొత్త యాంగిల్ ను చూపించాలని ప్రయత్నిస్తున్నాడు.
సినిమాలో రేవంత్ రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉండబోతుందనే ఇప్పటికే టీజర్ ద్వారా క్లియర్ గా కనిపించింది. ముఖ్యంగా ఫ్యూరియస్ డాన్ అనే ట్యాగ్ అతని రోల్ పై పై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం రేవంత్ కు ఉన్న డిమాండ్ కూడా గమనించాల్సిదే. వరుస అవకాశాలతో బిజీగా మారిన బుల్లిరాజు, టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్టులలో ఒకరిగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే రెండు హిట్లతో గుర్తింపు తెచ్చుకున్న అతనికి 'హై' కూడా విజయాన్ని అందిస్తే కెరీర్ మరో రేంజ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి మొత్తం 'హై' రిజల్ట్ పైనే ఉంది. బుల్లిరాజుగా నవ్వించిన రేవంత్, ఫ్యూరియస్ డా న్‌గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తే అతని మార్కెట్, క్రేజ్ రెండు కూడా మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్న వయసులోనే విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రేవంత్ కు 'హై' ఎంతటి మైల్ స్టోన్ గా నిలుస్తుందో విడుదల తర్వాత తేలనుంది.