ఐట‌మ్ పాట‌ను త‌ప్పుగా చూసే రోజుల్లో ఊర్మిళ సాహ‌సం!

ఏళ్ల తరబడి బాలీవుడ్ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య గీతాలలో ఒకటిగా నిలిచిన `చమ్మా చమ్మా` పాట అసలు ఊర్మిళ క‌నిపించ‌క‌పోయేదేమో!

Update: 2026-06-27 03:00 GMT

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన నృత్య గీతాలలో `చమ్మా చమ్మా` ఒకటి. ఈ అద్భుతమైన పాటలో తన అద్భుత‌మైన‌ డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రముఖ నటి ఊర్మిళా మాతోండ్కర్ తన కెరీర్‌లోనే అత్యంత మ‌ర‌పురాని ఈ పాట గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. అప్పట్లో ఐటెం సాంగ్స్ పై ఉన్న కొన్ని సామాజిక అపోహల కారణంగా... తాను ఈ చార్ట్‌బస్టర్ పాటలో నర్తించ‌డానికి మొదట్లో పూర్తిగా నిరాకరించానని ఒక పాపుల‌ర్ డ్యాన్స్ రియాలిటీ షో ఐదవ సీజన్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నప్పుడు వెల్లడించారు.

1998లో వచ్చిన `చైనా గేట్` చిత్రంలోని ఈ స్పెషల్ ట్రాక్ మేకింగ్ గురించి ఊర్మిళా మాట్లాడుతూ.. అప్పట్లో ఈ సాంగ్ ఆఫర్ తన వద్దకు ఎలా వచ్చిందో గుర్తుచేసుకున్నారు. అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి ఈ సినిమాలో ఒక ప్రత్యేక ఐటెం సాంగ్‌లో నటిస్తే బాగుంటుందని తనను కోరినట్లు ఊర్మిల‌ చెప్పారు. అయితే ఆ కాలంలో ఐటెం సాంగ్స్‌ను ప్రేక్షకులు... పరిశ్రమ వర్గాలు చాలా ప్రతికూల కోణంలో చూసేవారని.. అందుకే తాను దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నానని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తన అద్భుతమైన విజన్‌ను వివరించి.. త‌న‌ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశారు.

గతంలో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన కొన్ని నృత్య గీతాలను, వాటి కొరియోగ్రఫీని ప్రజలు ఇప్పటికీ ఎలాగైతే గుర్తుపెట్టుకుంటారో.. అదే విధంగా కాలేజీ యువత నుండి సామాన్యుల వరకు అందరి మనస్సుల్లో నిలిచిపోయేలా అంతకంటే మెరుగైన ఒక క్లాసిక్ సాంగ్‌ను సృష్టించడమే తన లక్ష్యమని దర్శకుడు ఊర్మిళ‌కు నమ్మకం కలిగించారు. ఈ క్రమంలోనే ఆ పాట చిత్రీకరణకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన తెరవెనుక రహస్యాన్ని కూడా ఊర్మిళా షేర్ చేసారు. ఈ పాట షూటింగ్‌ను పూర్తి చేయడానికి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ మొదట 12 రోజుల పాటు సుదీర్ఘమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు.

మూడు రోజుల్లోనే ముగిసిన షూటింగ్:

అయితే ఊర్మిళా అంకితభావం, అద్భుతమైన నృత్య ప్రతిభ కారణంగా పన్నెండు రోజుల పాటు ప్లాన్ చేసిన ఆ భారీ సాంగ్ షూటింగ్‌ను కేవలం మూడు రోజుల్లోనే విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ఈ అసాధారణమైన వేగం - నాణ్యత ఆ సమయంలో చిత్ర యూనిట్‌ను సైతం ఆశ్చర్యపరిచాయి. సదరు డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న మరో ప్రముఖ నటి కరిష్మా కపూర్ కూడా ఈ పాట విడుదలైన సమయంలో సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లోనే తాను ఈ పాటను చూసి ఫిదా అయ్యానని, ఊర్మిళా నటన - డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ప్రత్యేకంగా ప్రశంసించినట్లు కరిష్మా పేర్కొన్నారు.

కాలపరీక్షను తట్టుకొని ..

ఏళ్ల తరబడి బాలీవుడ్ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య గీతాలలో ఒకటిగా నిలిచిన `చమ్మా చమ్మా` పాట అసలు ఊర్మిళ క‌నిపించ‌క‌పోయేదేమో! కాన దర్శకుడి పట్టుదల, విజ‌న్- నటి ప్రతిభ కలిసి ఈ రోజుకీ పార్టీలు, వేడుకల్లో మార్మోగే ఒక యూనిక్ ట్రాక్‌ను ప్రేక్షకులకు అందించాయి. ఊర్మిళా మాతోండ్కర్ తాజాగా వెల్లడించిన ఈ ఆసక్తికరమైన విషయాలు... ఆ క్లాసిక్ ఐట‌మ్ పాట వెనుక ఉన్న కష్టాన్ని..ప్రయాణాన్ని అభిమానులకు ఒక సరికొత్త కోణంలో పరిచయం చేశాయి.

Full View
Tags:    

Similar News