మహేష్ బాబు లెవెల్ పంచులు: నందిని రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి గెస్ట్‌గా హాజరయ్యారు.
యంగ్ హీరో శ్రీ విష్ణు వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్. కొత్త దర్శకుడు జానకిరామ్ మారెళ్ల రూపొందిస్తున్న ఈ పీరియడ్ మూవీని రైటర్ కోన వెంకట్ సమర్పణలో నిర్మాతలు వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈవెంట్ వాతావరణంపై స్పందిస్తూ నందిని రెడ్డి సరదాగా స్పీచ్ ను మొదలుపెట్టారు. కోన వెంకట్ ఈవెంట్స్ అంటే తనకు కాలేజ్ రీయూనియన్ లాగా అనిపిస్తుందని చెప్పారు. డైరెక్టర్లు శివ నిర్వాణ, బాబీ కొల్లి, రామ్ అబ్బరాజు లాంటి కొలీగ్స్ అందరూ రెగ్యులర్‌గా ఇక్కడే కలుస్తుంటారని సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఆదిత్య చెప్పినట్లుగానే కోన వెంకట్ ఫంక్షన్ అంటే ఒక పెద్ద పండగలా, సెలబ్రేషన్ లాగా సాగుతుందని అన్నారు. వేదికపై పాటలు, టీజర్ చూశాక మూవీపై మరింత పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని చెప్పారు.
డెబ్యూ డైరెక్టర్ జానకిరామ్, నిర్మాత వెంకట కృష్ణ కర్నాటిలకు నందిని రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి సక్సెస్ ట్రెండ్‌లో నడుస్తోందని, కామ్రేడ్ కళ్యాణ్ కూడా అదే హిట్ ట్రాక్‌లోకి వచ్చి చేరాలని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె వేదికపై చెప్పారు.
హీరో శ్రీ విష్ణు గురించి మాట్లాడుతూ నందిని రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను శ్రీ విష్ణుకు వీరాభిమానినని గతంలోనే ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. ఆయన స్క్రీన్ మీద వేసే కామెడీ పంచుల కంటే రియల్ లైఫ్‌లో ఆఫ్ స్క్రీన్ వేసే సెటైర్లు, జోకులను తాను ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటానని నవ్వుతూ చెప్పారు.
ఆఫ్ స్క్రీన్ పంచుల్లో శ్రీ విష్ణును సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆమె పోల్చారు. బయట మహేష్ బాబు గారు ఎలాంటి లెవెల్ ఆఫ్ కామెడీ పంచెస్ వేస్తారో, శ్రీ విష్ణు కూడా సరిగ్గా అదే లెవెల్లో అద్భుతమైన పంచులు విసురుతారని ప్రశంసించారు. ఆయనకున్న ఎనర్జీకి, కామెడీ టైమింగ్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే సినిమా ఇదని, టీజర్ చూస్తుంటేనే ఆ విషయం తెలిపారు.
కోన వెంకట్‌కు ఈ సినిమాతో మరో భారీ విజయం దక్కాలని నందిని రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆమె ప్రసంగం ముగిసే సమయంలో కోన వెంకట్ స్పందిస్తూ, నందిని రెడ్డి గారు 'మా ఇంటి బంగారం' తీస్తే, శ్రీ విష్ణు ఇండస్ట్రీ బంగారమని చెప్పి అందరిని నవ్వించారు.