ఈసారి బుచ్చిబాబు మ్యూజిక్ ఆప్ష‌న్ అత‌డా?

టాలీవుడ్ సెన్షేష‌న్ బుచ్చిబాబు సానా మ్యూజిక్ విషయంలో తనకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉన్నవారు.

Update: 2026-07-08 07:47 GMT

టాలీవుడ్ సెన్షేష‌న్ బుచ్చిబాబు సానా మ్యూజిక్ విషయంలో తనకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉన్నవారు. తొలి సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ ను ఎంచుకుని మ్యూజిక‌ల్ గా మంచి హిట్ కొట్టాడు. ఇక రెండ‌వ సినిమా కోసం ఏకంగా స్వ‌ర‌ మాంత్రికుడు రెహ‌మాన్ నే రంగంలోకి దించి తానో సంచ‌ల‌నం అనిపించాడు. `పెద్ది` సినిమాకు రెహాన్ ఎలాంటి బాణీలు అందించారో? చెప్పాల్సిన ప‌నిలేదు. మ్యూజిక‌ల్ గా ముందే సినిమాను హిట్ చేసారు.రెహ‌మాన్ తో ప‌నిచేయాల‌ని ప్ర‌తీ ద‌ర్శ‌కుడు అనుకుంటారు. కానీ అవ‌కాశం అంత సుల‌భం కాదు.

ఆ ర‌కంగా బుచ్చిబాబు ఎంతో ల‌క్కీ. బుచ్చిబాబు టేస్ట్ తెలిసి గురువు సుకుమార్ సైతం విస్తుపోయారంటే? బుచ్చిబాబు ఎంత అడ్వాన్స్ గా ఉన్నాడు? అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఆ ర‌కంగా బుచ్చి మ్యూజిక్ సెన్సిబిలిటీస్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాజాగా బుచ్చిబాబు మూడవ చిత్రం కోసం కూడా తనదైన ప్లానింగ్‌తో సిద్ధమ వుతున్నారు. ఈసారి బుచ్చిబాబు దృష్టి సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ పై పడినట్లు విశ్వసనీయ సమాచారం. తన కథలోని ఎమోషన్‌కు హ్యారీస్ జైరాజ్ ట్యూన్స్ అయితే బాగుంటుందని బుచ్చిబాబు భావిస్తున్నారట.

ప్రాజెక్ట్ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇద్ద‌రి కాంబినేషన్ సెట్ అయితే అది మ్యూజిక్ లవర్స్‌కు పెద్ద పండగే అవుతుంది. హ్యారీస్ కు అవ‌కాశాలు త‌గ్గినా? అతడు ఎలాంటి ఆల్బ‌మ్స్ ఇచ్చాడు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో `వాసు`, `ఘ‌ర్ష‌ణ‌`, `ఆరెంజ్` లాంటి సినిమాకు అత‌డే సంగీతం అందించారు. ఇక త‌మిళ్ లో కంపోజ్ చేసిన ప్ర‌తీ సినిమా మ్యూజిక‌ల్ గా సంచ‌ల‌న‌మే అయింది. శంక‌ర్ లాంటి లెజెండ్స్ సైతం హ్యారీస్ తో ప‌ని చేసిన వారే.

బుచ్చిబాబుకు సంగీత దర్శకుల విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉంది. కథ ఏ జోనర్‌కు సంబంధించిందో? దానికి ఎలాంటి మ్యూజిక్ సెట్ అవుతుందో? ఆయనకు తెలిసినంత ఇంకెవరికీ తెలియదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. రెహమాన్ తర్వాత హ్యారీస్ జైరాజ్ వంటి పేరున్న సంగీత దర్శకుడిని సంప్రదించడం ద్వారా బుచ్చి సినిమాల సంగీత ప్రమాణాలను ఎంతలా పెంచుతున్నాడో? అర్థమవుతోంది. ఈ ఆలోచ‌నే సినిమాపై అంచనాలను అంత‌కంత‌కు పెంచుతుంది.

ఈ వ్య‌వ‌హారం ఇంకా చర్చల దశలోనే ఉన్నా? బుచ్చిబాబు ఇప్పటికే హ్యారీస్ జైరాజ్ టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. హ్యారీస్ కూడా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్దరి కలయిక సాధ్యమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బుచ్చిబాబు సినిమాలు అంటేనే మ్యూజిక్ ప్రాధాన్యత ఉంటుంది.ఈ నేప‌థ్యంలో హ్యారీస్ లాంటి మెలోడీ కింగ్ తోడైతే ఆ సినిమా మ్యూజికల్‌గా ఏ స్థాయికి వెళ్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

మొత్తంగా బుచ్చిబాబు స్టార్ హీరోల కోసమే కాదు. స్టార్ టెక్నీషియన్ల కోసం కూడా పాకులాడుతున్నారు. సినిమాను కథగానే కాకుండా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో కళాఖండంగా మార్చడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ప్ర‌శంసనీయం . సంగీత దర్శకుల పట్ల బుచ్చికున్న టేస్ట్ భవిష్యత్తులో ఆయనను టాలీవుడ్‌లో గొప్ప దర్శకుడిగా నిలబెడుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News