ప‌ర్య‌వేక్ష‌ణ కోసం పెద్దాయ‌న ఛార్జ్ అది!

ఇండ‌స్ట్రీలో ఫాంలో ఉన్నంత కాలం తిరుగుండ‌దు. వ‌ద్ద‌న్నా డ‌బ్బు వ‌చ్చి ప‌డుతుంది. బ్రాండ్ తో కోట్ల ఆద‌యాం స‌మ‌కూరుతుంది.;

Update: 2025-11-10 06:23 GMT

ఇండ‌స్ట్రీలో ఫాంలో ఉన్నంత కాలం తిరుగుండ‌దు. వ‌ద్ద‌న్నా డ‌బ్బు వ‌చ్చి ప‌డుతుంది. బ్రాండ్ తో కోట్ల ఆద‌యాం స‌మ‌కూరుతుంది. న‌టీన‌టుల నుంచి ద‌ర్శ‌కుల వ‌ర‌కూ త‌మ పేరునే పెట్టుబ‌డిగా పెట్టి సంపాదిస్తుంటారు. ఇక నిర్మాత‌లైతే? త‌మ సంస్థ‌కున్న బ్రాండ్ ఇమేజ్ ఆధారంగా కోట్లు గ‌డిస్తుంటారు. నిర్మాణంలో రూపాయి పెట్టుబ‌డి పెట్ట‌కుండానే? త‌మ సంస్థ పేరు రిలీజ్ కు ముందు పోస్టర్ లో వేస్తే చాలు వాస్త‌వ నిర్మాత ఒప్పందం ప్ర‌కారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొంత మంది స్టార్ డైరెక్ట‌ర్లు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ అంటూ ఇత‌ర ద‌ర్శ‌కుల చిత్రాల‌కు త‌మ పేరు వేసుకుంటారు.

కొత్త వాళ్ల‌కు ప‌ర్యవేక్ష‌ణ మంచిదే:

సినిమా ఎలా వ‌చ్చింది? అందులో లోటుపాట్లు ఏమున్నాయో చూసి స‌రి చేస్తూ ల‌క్ష‌లు ఆర్జిస్తున్నారు. కొంత కాలంగా ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఇండ‌స్ట్రీలో ఇలాగే సంపాదిస్తున్నారు. చిన్న చిన్న సినిమాల‌కు డైరెక్ట‌ర్ల‌ను సెట్ చేయ‌డం లేదా? త‌న వ‌ద్ద గ‌తంలో ప‌నిచేసిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌ను ఇంట‌ర్ డ్యూస్ చేయ‌డం వాళ్ల పేరుతో సినిమా మొద‌లు పెట్ట‌డం..అందులో ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ అంటూ పేరు వేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఇలా ఆ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తో రెండు ర‌కాల ఉప‌యోగాలు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న బ్రాండ్ తో కొత్త‌వాళ్లు మార్కెట్లో కి రావ‌డం ఈజీ అవుతుంది.

బ్యాన‌ర్ తో ర్యాపో కీల‌క‌మైందే:

బిజినెస్ ప‌రంగానూ సినిమాకు ప్ల‌స్ అవుతుంది. ఈ ర‌కంగా వాళ్ల‌కు స‌హాయం అందించిన‌ట్లు అవుతుంది. అయితే ఆ పెద్దాయ‌న ఇలా చేసినందుకు గాను అక్ష‌రాలా సినిమాకు 20 నుంచి 25 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తున్నారుట‌. అయితే ఇది ఫిక్సుడు అమౌంట్ కాదు. ఆ సినిమా నిర్మించే బ్యాన‌ర్ మీద ఆధార ప‌డి ఉంటుందిట‌. పెద్ద బ్యాన‌ర్ అయితే అంత కు రెట్టింపు పారితోషికం ఛార్జ్ చేస్తుంటారుట‌. పెద్ద బ్యాన‌ర్ల‌లో కొత్త డైరెక్ట‌ర్లు సినిమాలు చేసే స‌మ‌యంలో? ఆ పెద్దాయ‌న అవ‌స‌రం ప‌డుతుందుట‌. బ్యాన‌ర్ తో త‌న‌కున్న సాన్నిహిత్యం కూడా ఇక్క‌డ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసిన స‌మాచారం.

కొంత కాలంగా ప్ర‌యాణం అలాగే:

ప్ర‌త్యేకించి చిన్న నిర్మాణ సంస్థ‌లైతతో అయ‌తే సినిమా మొదల‌య్యే ముందు నిర్మాత మొత్తం అమౌంట్ క్లియ‌ర్ చేయాల్సి ఉంటుందిట‌. సినిమా ఫ‌లితంతో త‌న‌కెలాంటి సంబంధం లేకుండా ముందే ఒప్పందం రాసుకుని ఆప్ర‌కారం పెద్దాయ‌న ముందుకెళ్తున్న‌ట్లు తెలిసింది. మ‌రి పర్య‌వేక్ష‌ణ పేరుతో అత‌డు చేసే ప‌నేంటి? అంటే! అప్పుడ‌ప్పుడు సినిమా సెట్స్ కు వెళ్ల‌డం..ర‌ఫ్ పుటేజ్ చూసి అందులో క‌రెక్ష‌న్స్ ఉంటే చెప్ప‌డం..వాటిని ద‌గ్గ‌రుండి మ‌ళ్లీ రీ షూట్ చేయించ‌డం వంటివి అత‌డి ప్ర‌ధాన‌ విధులుగా తెలుస్తోంది. అలాగే రిలీజ్ కు ముందు ప్ర‌చారంలో పాల్గొన‌డం..సెట్స్ లో ఎవ‌రి ప‌నిత‌నం ఎలా ఉంది? అన్న‌ది మీడియా ముందు ఉంచ‌డం వంటివి చేయ‌డం అత‌డి ప‌ని. కొంత కాలంగా ఆ పెద్దాయ‌న ప్ర‌యాణం ఇండ‌స్ట్రీలో ఇలాగే సాగుతోంది.

Tags:    

Similar News