సంచ‌ల‌న హీరో జీవితంలో ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు!

ఆ సమయంలో తనకు తానుగా సహాయం అందించుకోవడానికి .. వ్యసనాల నుంచి బయటపడటానికి థెరపీని ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు.

Update: 2026-08-11 06:14 GMT

హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత పాపులర్ అయిన గ్లోబల్ స్టార్ బ్రాడ్ పిట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాజాగా వెల్లడించిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఎదురైన కుటుంబ సమస్యల కారణంగా తాను మానసికంగా ఎంతగా కుంగిపోయారో? బ్రాడ్ ఫిట్ వివరించారు. ఆ సమయంలో తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనై, ఆత్మహత్య ఆలోచనలు (సుసైడల్ థాట్స్) కూడా కలిగాయని ఓపెన్‌గా మాట్లాడారు. తన మాజీ భార్య ఏంజెలీనా జోలీతో విడాకులు -కుటుంబ కలహాలు తలెత్తిన సమయంలో మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోయినట్లు బ్రాడ్ పిట్ తెలిపారు.

సుమారు ఏడు సంవత్సరాల పాటు ఎలాంటి మందులకు, మద్యానికి దూరంగా ఉంటూ సంయమనం పాటించినా? ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేక మళ్లీ మద్యపానానికి బానిసయ్యానని బ్రాడ్ పిట్ అంగీకరించారు. ఆ కాలం తన జీవితంలోనే అత్యంత చీకటైన, కఠినమైన దశ అని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురైన ఊహించని పరిణామాలు, వ్యక్తిగత బంధాలు దెబ్బతిన్న తీరు తనను మానసికంగా పూర్తిగా నిర్వీర్యం చేశాయని బ్రాడ్ పిట్ పేర్కొన్నారు. బయటకు గ్లామరస్ లైఫ్ క‌నిపిస్తున్నా? తెరవెనుక తాను పడిన మానసిక వేదన వర్ణనాతీతమని తెలిపారు.

ఆ సమయంలో తనకు తానుగా సహాయం అందించుకోవడానికి .. వ్యసనాల నుంచి బయటపడటానికి థెరపీని ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎలాంటి కష్టసమయంలోనైనా ధైర్యంగా నిలబడాల్సిన సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు మానసిక సమస్యలతో తీవ్రంగా పోరాడాల్సి వస్తుందనేదానికి బ్రాడ్ పిట్ అనుభవమే నిదర్శనంగా నిలుస్తుంది. తన బలహీనతలను బహిరంగంగా అంగీకరించడం ద్వారా మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను బ్రాడ్ పిట్ అందరికీ తెలియజేశారు. డిప్రెషన్‌తో బాధపడేవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదని, సరైన సహాయం తీసుకోవడం ద్వారా ఆ గండం నుంచి బయటపడొచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఆ గడ్డుకాలాన్ని అధిగమించి కెరీర్‌పై .. వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టినట్లు బ్రాడ్ పిట్ తెలిపారు. జీవితంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. బ్రాడ్ పిట్ చెప్పిన కఠిన నిజాలు ప్ర‌స్తుతం హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. హాలీవుడ్ అగ్ర హీరో అయినా? బ్రాడ్ పిట్ పడిన ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేసేలా చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు ఎంతటివారినైనా మానసికంగా ఎలా కుంగదీస్తాయో? బ్రాడ్ పిట్ అనుభవం ద్వారా మ‌రోసారి అర్ద‌మ‌వుతుంది. అన్నింటినీ ఎదుర్కొని బ్రాడ్ పిట్ మళ్లీ సాధారణ జీవితానికి తిరిగి రావడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Tags:    

Similar News