పిక్‌టాక్‌ : అందానికి అర్థం ఈ తల్లి కూతురు

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ట్రెండ్‌ కావడం మనం చూస్తూనే ఉన్నాం.

Update: 2026-05-12 11:30 GMT

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ట్రెండ్‌ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలిచిన కరిష్మా కపూర్‌ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో వైరల్‌ అవుతూనే ఉంది. అయిదు పదుల వయసులోనూ కరిష్మా కపూర్‌ ఎంతో మంది హీరోయిన్స్‌ కంటే అందంగా ఉందంటూ ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ స్టార్‌ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించే సత్తా, అందం కరిష్మా కపూర్ కి ఉందని చాలా మంది భావిస్తూ ఉంటారు. నాలుగు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌లు దక్కించుకున్న ఈమెకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్రం పురస్కారం సైతం దక్కింది. ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా కూడా కరిష్మా కపూర్ రికార్డ్‌ సాధించింది.

కరిష్మా కపూర్‌ హీరోయిన్‌గా...

ప్రేమ్‌ ఖైదీ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించిన కరిష్మా కపూర్ చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌లను దక్కించుకుంది. కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ దశాబ్ద కాలం పాటు తన సినీ ప్రస్థానం కొనసాగించింది. 2004లో సినీ కెరీర్‌కి గుడ్‌ బై చెప్పినప్పటికీ అప్పుడప్పుడు టీవీల్లో కనిపించడం, సోషల్‌ మీడియాలో సందడి చేయడం, ఈమె నటించిన సినిమాలు ఎప్పటికప్పుడు టీవీల్లో ప్రసారం కావడం వల్ల కరిష్మా కపూర్ ఇంకా ఇండస్ట్రీలో ఉందనే అభిప్రాయం ఉంది. ఈ మధ్య కాలంలో మళ్లీ ఇండస్ట్రీలో ఈమె సందడి మొదలైంది. కొన్ని సినిమాలు ఈమె నటించడం ద్వారా పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈమె అరుదుగా మాత్రమే ఈమె సినిమాలు చేస్తూ వచ్చింది. అది కూడా గెస్ట్‌ రోల్స్ కావడంతో ఈమె మళ్లీ సినిమాలు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

సమైరా కపూర్‌ హీరోయిన్‌గా...

కరిష్మా కపూర్‌కి సమైరా కపూర్‌ అనే కూతురు ఉంది. ఇద్దరూ అరుదుగా కలిసి కనిపిస్తారు. సోషల్‌ మీడియాలో వీరిద్దరి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తల్లి కూతురు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అందానికి ఈ ఇద్దరూ అర్థం అన్నట్లుగా ఉన్నారని, 51 ఏళ్ల వయసులో కరిష్మా కపూర్ చాలా అందంగా ఉందని, 21 ఏళ్ల తన కూతురు సమైరా కపూర్‌ కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉందని కరిష్మా కపూర్‌ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లి కూతురు కలిసి ఒక సినిమాలో నటించాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. నటిగా రీ ఎంట్రీకి కరిష్మా ఆసక్తిగా ఉందనే విషయం బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత రెండేళ్లుగా కొత్త సినిమాలు ఏమీ కమిట్‌ కాలేదు, కానీ మంచి కథతో వస్తే కరిష్మా మళ్లీ నటించేందుకు రెడీగా ఉందట.

సోషల్‌ మీడియాలో తల్లి కూతురు ఫోటోలు...

ఇక సమైరా కపూర్‌ విషయానికి వస్తే ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే వయసు రాలేదని అంటున్నారు. కరిష్మా కపూర్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కూతురు హీరోయిన్‌గా నటించాలంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చింది. అయితే నటిగా తనకు ఇవ్వాల్సిన సూచనలు చేస్తానని మాత్రం చెప్పింది. సమైరా ఇప్పటికే ఒక షార్ట్‌ ఫిల్మ్‌ లో నటించి, తన ఫేస్‌ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలతో సమైరా పరిచయం అయ్యింది. రాబోయే రెండు మూడు ఏళ్లలో సమైరా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆమెను తమ సినిమాల్లో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ యంగ్‌ హీరోలు సైతం ఈమెతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. తల్లి దారిలో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సమైరా ఏమేరకు హిట్‌ అయ్యేనో చూడాలి.

Tags:    

Similar News