బిగ్ బాస్ లో ఛాన్స్.. వినూత్నంగా ప్రచారం!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్కరి కల అని చెప్పాలి.
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్కరి కల అని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు ఎంతోమంది ఈ హౌస్ లోకి అడుగుపెట్టి పాపులారిటీని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది క్రేజ్ కోసం హౌస్ లోకి అడుగుపెడితే.. మరికొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కావాలంటున్నారు. అందులో భాగంగానే యూట్యూబ్ ద్వారా, ఇంస్టాగ్రామ్ ద్వారా పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను రిక్వెస్ట్ చేస్తూ తమ వీడియోలు నిర్వాహకుల వరకు, నాగార్జున వరకు వెళ్లాలా చేయండి అంటూ బ్రతిమలాడుతున్నారు కూడా..
అయితే ఇంకొంతమంది బిగ్ బాస్ లాంటి షోలకి వెళ్లడమే తప్పు అనే రేంజ్ లో కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ ఒక బూత్ షో అనే రేంజ్ లో మండిపడుతున్నారు. అయితే ఇంకొంతమంది అవకాశం వచ్చినా ఇతర బిజీ షెడ్యూల్ వల్ల వెళ్లలేకపోతున్నారు
ఇకపోతే హిందీ భాషలో ఇప్పటికే 19 సీజన్లు పూర్తికాగా, ఇప్పుడు తెలుగులో 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. త్వరలో బిగ్ బాస్ దశావతారం అంటూ సీజన్ 10 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సామాన్యులను హౌస్ లోకి ఎంపిక చేయడం కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా ఈనెల ఆఖరి వారంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
15 ఎపిసోడ్లతో ప్రారంభమయ్యే ఈ సీజన్లో గత సీజన్ జడ్జెస్ మళ్లీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఇప్పటికే 25 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇదంతా బాగానే ఉన్నా హౌస్ లోకి వెళ్లడానికి అటు యూట్యూబ్ ను , ఇంస్టాగ్రామ్ ను, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను వేదికగా చేసుకొని కొంతమంది సామాన్యులు అలాగే సెలబ్రిటీలు కూడా మాకు బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఉంది అంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇలా హౌస్ లోకి వెళ్లాలనే తపన ఎక్కువ అవడంతో అభ్యర్థులలో క్యూరియాసిటీ పెరిగిపోయి.. వినూత్న పద్ధతిలో ప్రచారాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వాకులు , హోస్ట్ నాగార్జున దృష్టిలో పడడానికి ఏకంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభానికి ముందే అభ్యర్థుల ఎంపికపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా మొదలైంది .
హౌస్ లో అవకాశం కోసం కొందరు అభ్యర్థులు వినూత్నంగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. హోస్ట్ నాగార్జున, నిర్వాహకుల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంపై అటు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా హౌస్ లో ఒక్క ఛాన్స్ కోసం వినూత్నంగా చేపట్టిన ఈ ప్రచారం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది . మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరో తెలియాలి అంటే షో ప్రారంభం వరకు ఎదురు చూడాల్సిందే. ఇక మరొకవైపు ఎన్నడూ లేని విధంగా అగ్నిపరీక్ష ద్వారా ఏకంగా 8 మంది సామాన్యులు బిగ్బాస్ సీజన్ 10 లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.