బిగ్‌బాస్ తెలుగు 10 ప్రీ షో మొత్తం ట్రోలింగే.. కానీ ఆ విషయంలో మాత్రం పాజిటివ్!
బిగ్‌బాస్ తెలుగు 10 ఇంకా ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
బిగ్‌బాస్ తెలుగు 10 ఇంకా ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ఈసారి ఈ షో గురించి ఎక్కువగా చర్చ జరగడానికి కారణం పాజిటివ్ కామెంట్లు మాత్రమే కాదు. ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు కూడా బిగ్‌బాస్‌పై అందరి దృష్టిని తీసుకొస్తున్నాయి.
బిగ్‌బాస్ తెలుగు 10కు ముందు అగ్నిపరీక్ష పేరుతో ఒక ప్రీ షో వచ్చిన సంగతి తెలిసి. ఈ ప్రీ షోపై ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెగ పెట్టేస్తున్నారు. కొందరు ఈ షోలో జరిగిన కొన్ని అంశాలపై తెగ మంది పడుతూ ఉండగా, మరికొందరు ఫన్నీ కామెంట్లు, మీమ్స్‌తో తమ స్పందనను తెలియజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ అగ్నిపరీక్ష గురించి ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
సాధారణంగా ఏ టీవీ షోకైనా నెగెటివ్ పబ్లిసిటీ మంచిది కాదని భావిస్తారు. కానీ బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షో విషయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. ఒక షో గురించి ప్రేక్షకులు ప్రతిరోజూ మాట్లాడుకుంటున్నారంటే.. ఆ షో వారి దృష్టిలో ఉందని అర్థం.
అగ్నిపరీక్షపై వస్తున్న ట్రోలింగ్ ఇప్పుడు ఒక రకంగా షోకు పబ్లిసిటీగా మారుతోంది. కొంతమంది ప్రేక్షకులు కంటెంట్ నచ్చలేదని చెబుతున్నా.. మరికొందరు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి షోను చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరులు చేస్తున్న కామెంట్లు చూసి, షోపై ఆసక్తి పెంచుకునే ప్రేక్షకులు కూడా రోజురోజుకి పెరుగుతున్నారు.
బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలకు ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ చాలా ముఖ్యం. పాజిటివ్ కామెంట్లు వస్తే మంచిదే. కానీ ఒక షో గురించి నెగెటివ్‌గా అయినా ప్రేక్షకులు నిరంతరం మాట్లాడుతుంటే.. అది కూడా ఆ షోకు విజిబిలిటీ తీసుకురావచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా జరిగితే.. ఆ షో గురించి తెలియని వారికి కూడా దాని పేరు చేరుతుంది.
అందుకే ప్రస్తుతం అగ్నిపరీక్షపై జరుగుతున్న ట్రోలింగ్‌ను పూర్తిగా నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు నెగెటివిటీ కూడా పబ్లిసిటీగా ఉపయోగపడుతుంది.
అయితే అసలు పరీక్ష మాత్రం బిగ్‌బాస్ తెలుగు 10 ప్రారంభమైన తర్వాతే ఉంటుంది. కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత షో ఎలా సాగుతుంది? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అనేది చూడాలి. ప్రీ షోతో వచ్చిన ఈ బజ్‌ను బిగ్‌బాస్ 10 కొనసాగించగలిగితే మాత్రం షోకు మంచి ప్లస్ అవుతుంది.