బిగ్ బాస్ 10లోకి 'చెన్నై లవ్ స్టోరీ' నటుడు.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
ఇదిలా ఉండగా హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. దూసుకుపోతున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి కాగా.. పదవ సీజన్ కి సర్వం సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి గ్రాండ్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 షోని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు సామాన్యులను హౌస్ లోకి పంపించడానికి అగ్నిపరీక్ష సీజన్ 2 కూడా మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 25 వేలకు పైగా దరఖాస్తులు సామాన్యుల నుంచి రాగా.. అందులో 70 మందిని ఎంపిక చేసి , అగ్నిపరీక్ష షోలో 15 మందిని ఫైనల్ చేసి , వీరిని బిగ్ బాస్ స్టేజ్ పైకి పంపిస్తారు. ఇక అందులో ఆరుగురిని హౌస్ లోకి పంపించబోతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి చెన్నై లవ్ స్టోరీ నటుడు..
ఇదిలా ఉండగా హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ నుంచి కమెడియన్ ఆటో రాంప్రసాద్, మరో కమెడియన్ పొట్టి నరేష్ హౌస్ లోకి వెళ్లబోతున్నారని , జబర్దస్త్ నుంచి వీరిద్దరూ ఫైనల్ అయ్యారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక మరొకవైపు చెన్నై లవ్ స్టోరీ నటుడు కూడా హౌస్ లోకి వెళ్ళబోతున్నారని, ఆయన రెమ్యూనరేషన్ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ మూవీలో కనిపించిన నటుడు ఆదిత్ అరుణ్ బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం . ముఖ్యంగా నిర్వాహకులు ఇప్పటికే ఆయనను సంప్రదించగా.. హౌస్ లోకి వెళ్లడానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు..
వైరల్ చేస్తున్న అభిమానులు..
ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్ళబోతున్న చెన్నై లవ్ స్టోరీ నటుడు ఆదిత్ అరుణ్ కి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వబోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవ్వగా.. సినిమాలలో ఆయన క్రేజ్ ను బట్టి సుమారుగా వారానికి రెండు లక్షల వరకు ఒప్పందం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే గనుక 100 రోజులు హౌస్ లో ఉండి టైటిల్ గెల్చుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తుది వివరాలు తెలిసేది ఆరోజే..
ఇకపోతే ఎప్పటిలాగే ఈ షో కి నాగార్జున మరొకసారి హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. పైగా ఆయన ఈ సీజన్ కోసం రూ.35 నుండి రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం . ఏది ఏమైనా ఈ బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ జాబితా రోజుకో లిస్టు వైరల్ అవుతోంది. ఇక తుది వివరాలు తెలియాలి అంటే సెప్టెంబర్ 6న గ్రాండ్గా ఎపిసోడ్ లాంచ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే