భరణికి రీ ఎంట్రీలోనూ.. అదే బ్యాడ్ లక్..!

ఐతే భరణి ఎలిమినేషన్ కి పరోక్షంగా ఈ బాండింగే కారణం అయ్యింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో రీ ఎంట్రీ ఇచ్చాడు భరణి. శ్రీజతో అతని రీ ఎంట్రీ హౌస్ మెట్స్ కి షాక్ ఇచ్చింది.;

Update: 2025-10-29 03:45 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న అతను తనూజ, దివ్య తో బాండింగ్ ఏర్పరచుకుని హౌస్ లో మిగతా వారి కోసం కాకుండా వారిద్దరితోనే ఉండటం వల్ల వెనకపడ్డాడు. ఫైనల్ గా అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఐతే భరణి ఎలిమినేషన్ కి పరోక్షంగా ఈ బాండింగే కారణం అయ్యింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో రీ ఎంట్రీ ఇచ్చాడు భరణి. శ్రీజతో అతని రీ ఎంట్రీ హౌస్ మెట్స్ కి షాక్ ఇచ్చింది.

శ్రీజ, భరణికు హౌస్ మెట్స్ సలహాలు..

ఐతే భరణి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీజ, భరణి లకు హౌస్ మెట్స్ కొన్ని సలహాలు ఇచ్చారు. ముందు వారాల్లో వారి ఆట గురించి ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏది మార్చుకోవాలన్నది వాళ్లకి ఒక మిర్రర్ మీద రాసి చూపించారు. ఐతే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉండేలా బిగ్ బాస్ ప్లానింగ్ ఉందట. అందుకు టాస్క్ లు ఆడినట్టు తెలుస్తుంది.

శ్రీజ, భరణి ఇద్దరిలో ఒకరు హౌస్ లో ఉంటారని వారిలో ఎవరు ఉండాలన్నది ఒక టాస్క్ పెట్టారు. ఐతే భరణి టాస్క్ ఆడుతూ భుజం నొప్పితో మళ్లీ హాస్పిటల్ కి వెళ్లాడు. భరణి మళ్లీ తిరిగి వస్తాడా లేదా అన్న కన్ ఫ్యూజన్ కొనసాగింది. ఐతే ఫైనల్ గా మళ్లీ భరణి హౌస్ లోకి వచ్చాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో భరణి కొనసాగుతున్నాడు. ఐతే శ్రీజ, భరణి ఇద్దరు కూడా రీ ఎంట్రీలో తమ మార్క్ చూపించాలని చూస్తున్నారు.

శ్రీజ రీ ఎంట్రీ హౌస్ లో మళ్లీ ఫైర్..

సీజన్ 9లో ఊహించని ట్విస్ట్ లు ఏర్పడుతున్నాయి. శ్రీజ రీ ఎంట్రీ హౌస్ లో మళ్లీ ఫైర్ మొదలైంది. రావడం రావడమే తన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మాటల తూటాలను వదులుతుంది శ్రీజ. ముఖ్యంగా శ్రీజ మాధురిని మెయిన్ టార్గెట్ చేసినట్టు అయ్యింది. హౌస్ లో భరణి, శ్రీజ రీ ఎంట్రీ తర్వాత ఆట ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 ఎనిమిదో వారంలో హౌస్ లోకి మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అది కూడా ఎలిమినేట్ అయిన వాళ్లు ఎంట్రీ ఇవ్వడం తప్పకుండా ఆడియన్స్ లో క్యూర్యాసిటీ పెంచుతుంది. మరి నెక్స్ట్ రాబోయే వారాల్లో హౌస్ లో ఎలాంటి టర్న్ అండ్ ట్విస్ట్ లు ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News