మంచు మనోజ్ పొలిటికల్ స్టెప్.. భార్యతో ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. నటుడు మంచు మనోజ్ భార్య, భూమా కుటుంబ వారసురాలు భూమా మౌనిక రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Update: 2026-05-19 11:37 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. నటుడు మంచు మనోజ్ భార్య, భూమా కుటుంబ వారసురాలు భూమా మౌనిక రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రేపు తన పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మనోజ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం తాము యాక్టివ్ పాలిటిక్స్ లో భాగమయ్యామని, మౌనిక ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమని స్పష్టం చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది.

గత ఎన్నికల ప్రచార సమయంలోనే మౌనిక యాక్టివ్ గా తిరగడం చూసి జనాలు ఆమె రాజకీయ ఎంట్రీని ముందే ఊహించారని మనోజ్ చెప్పారు. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టే ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలిపారు. రాయలసీమ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల వారసత్వాన్ని కొనసాగిస్తూ మౌనిక, ఇప్పుడు మళ్లీ ఆ పాత వైభవాన్ని నిలబెట్టేలా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

ఏ నియోజకవర్గం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచినా, పోటీ చేయడం మాత్రం పక్కా అని తేలిపోయింది. ఇదే ప్రెస్ మీట్ లో మనోజ్ తమ సరికొత్త సేవా కార్యక్రమాల గురించి కూడా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేదలకు, కష్టాల్లో ఉన్న వారికి సపోర్ట్ ఇవ్వడం కోసం తాము ఇటీవల ‘ఐక్య ధైర్య సేన సమితి’ అనే ఆర్గనైజేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్స్, ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ లాంటి ఎన్నో పనులు ప్లాన్ చేస్తున్నామని వివరించారు.

ఈ సేవా సంస్థకు తాము చేయబోయే రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన చాలా క్లియర్ గా అనౌన్స్ చేశారు. ప్యూర్ గా మానవత్వంతోనే ఈ పనులు చేస్తున్నామని చెప్పారు.

ఈ సంస్థ నిర్వహణ కోసం ఎలాంటి పొలిటికల్ ఫండ్స్ లేదా ఇతరుల సహాయం తీసుకోవడం లేదని, పూర్తిగా తమ సొంత నిధులతోనే ఖర్చు పెడుతున్నట్లు మనోజ్ వెల్లడించారు. ఒకవైపు పాలిటిక్స్ లో ఉంటూనే, మరోవైపు సమాజ సేవను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తామని నమ్మకంగా చెప్పారు.

సాధారణంగా సినిమా స్టార్ల భార్యలు స్క్రీన్ లేదా బిజినెస్ లకే పరిమితం అవుతుంటారు. కానీ మౌనిక మాత్రం తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కి తగ్గట్టుగా పబ్లిక్ లైఫ్ లోకి రావాలని అనుకోవడం స్పెషల్. మనోజ్ ఇచ్చిన ఈ లీక్ తో రాయలసీమ పాలిటిక్స్ లో సరికొత్త ఈక్వేషన్స్ మారే ఛాన్స్ కనిపిస్తోంది. భూమా నాగిరెడ్డి కూతురిగా మౌనికకు స్థానికంగా ఉన్న ఫాలోయింగ్ తో పాటు మంచు ఫ్యామిలీ సపోర్ట్ కూడా తోడవ్వడం ప్లస్ కానుంది. త్వరలోనే ఆమె ఏ పార్టీ తరఫున, ఏ సీటు నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News