మహేష్ ట్వీట్ - VD షర్టు.. అన్నీ ఫేక్: బండ్లన్న చెప్పింది వాస్తవమే కానీ..

బండ్ల గణేష్ ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌లో చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-09-19 05:22 GMT

బండ్ల గణేష్ ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌లో చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీలో మాఫియా వ్యవస్థలు ఉన్నాయని, కొందరు క్రెడిట్స్ కొట్టేస్తాడని, చిన్న సినిమాలు బ్రతకనీయరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అలాగే కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తీసిన లిటిల్ హార్ట్స్ పెద్ద సినిమాలకు సవాల్ విసిరిందని, మంచి కథ ఉంటేనే విజయం వస్తుందని స్పష్టంగా చెప్పారు.

హీరో మౌళి గురించి మాట్లాడుతూ, సినిమా చూడగానే తన తండ్రి గుర్తొచ్చాడని, ఫాదర్ సన్ ఎమోషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అయితే మౌళికి "ఈ విజయంతో ఊగిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చాము అనే బేస్ మర్చిపోవద్దు" అని సలహా ఇచ్చారు. ఇక ఆయన మరికొన్ని మాటలు కాస్త ఘాటు ఉండడంతో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

విజయ్ దేవరకొండ రౌడి టీ షర్ట్ ఇచ్చాడు... మహేష్ బాబు ట్వీట్ వేసాడు... ఇవన్ని అబద్ధాలు. నిన్ను ఇంప్రెస్ చెయ్యడానికి... నీకు విషెస్ చెప్పడానికి చేస్తారు. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వస్తాడు.” అని అన్నారు. అయితే కొత్త వాళ్లను ఆమాత్రం సపోర్ట్ చేయకపోతే ఎలా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మహేష్ బాబు కూడా స్టార్ క్యాస్ట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఎప్పుడూ సినిమా చూసి ట్వీట్ చేస్తాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.

లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా ఇలాగే పాజిటివ్‌గా ఎంకరేజ్ చేశాడని.. అలాగే విజయ్ దేవరకొండ లాంటి హీరో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తన కష్టంతో ఎదిగాడు. అలాంటి వారికి సపోర్ట్ ఇవ్వడమే ఆయనకు అలవాటు అని మరికొందరు అంటున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఇండస్ట్రీకి కూడా ఉపయోగకరం. బండ్ల గణేష్ ఈ పాయింట్‌ను మరో కోణంలో హైలైట్ చేస్తూ, మౌళి వంటి కొత్తవాళ్లు విజయంతో మత్తెక్కిపోవద్దని, స్థిరంగా ఉండాలని చెప్పడం సరైనదే.

కానీ ఆయన చెప్పే విధానం కాస్త ఘాటుగా మారింది. దాంతో ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు ఆయన మాటల్లో నిజం ఉందని అంగీకరించగా, మరికొందరు "ఫ్యాన్స్‌ను నొప్పించకుండా, కాస్త సాఫ్ట్‌గా చెప్పి ఉంటే బెటర్‌" అనిపిస్తోంది అన్నారు.

ఎందుకంటే బండ్ల గణేష్ ఓపెన్‌గా మాట్లాడే స్వభావం ఉన్నా, అతని టోన్ కారణంగా వివాదం ఎక్కువైపోయింది. అయితే, ఇలా మాట్లాడడం వలన మహేష్, VD లాంటి వాళ్ళు నెక్స్ట్ టైమ్ సపోర్ట్ చేయడానికి వెనుకడుగు వేసేలా చేయవద్దనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఫ్యాన్స్ భావోద్వేగాలను కూడా గౌరవిస్తూ చెప్పడం మంచిదనే కామెంట్స్ సైతం వస్తున్నాయి. మరి ఈ విషయం ఇంతటితో ముగుస్తుందా లేదంటే మరో క్లారిటీతో కొనసాగుతుందా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి.

Tags:    

Similar News