బాలయ్య విలన్‌గా యాంగ్రీ మ్యాన్.. ఈసారైనా సెట్టవుతుందా?
నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ మీద రోజుకో ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకు వస్తోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ మీద రోజుకో ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకు వస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ను తీసుకుంటున్నారనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే గనుక నిజమైతే, స్క్రీన్ మీద ఇద్దరు పవర్ఫుల్ యాంగ్రీ స్టార్స్ డామినేషన్ మామూలుగా ఉండదు. హీరోగా తనదైన అగ్రెసివ్ మార్క్ చూపించిన రాజశేఖర్ ను, ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ లో ఇంతవరకు చూసింది లేదు.
నిజానికి రాజశేఖర్ కు ఇలాంటి విలన్ ఆఫర్స్ రావడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. మంచి నెగెటివ్ క్యారెక్టర్ దొరికితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి తను రెడీ అని ఆయన గతంలోనే చాలా క్లియర్ గా చెప్పారు. ధృవ సినిమాలో అరవింద్ స్వామి లాంటి స్టైలిష్ విలన్, అరవింద సమేతలో జగపతిబాబు చేసిన పవర్ఫుల్ విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని కూడా ఆయన ఓపెన్ అయ్యారు. అయితే రెగ్యులర్ రొటీన్ విలన్ గా మాత్రం చేసేది లేదని తేల్చి చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొరటాల శివ ఆయనకు ఎలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ రాశాడన్నదే అసలు పాయింట్.
దీనికి తోడు ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్ లో మెప్పించబోతున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. తండ్రీకొడుకులుగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో ఆయన కనిపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. కొరటాల శివ సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అవుతుందో, ఆ హీరోను ఢీకొట్టే విలన్ క్యారెక్టర్ కు కూడా అంతే స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఒకవేళ రాజశేఖర్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే, డైలాగ్ డెలివరీలో పీక్స్ చూపించే బాలయ్యకు ఆయన పర్ఫెక్ట్ కౌంటర్ అవుతాడని చెప్పవచ్చు.
మరో ఆసక్తికరమైన కనెక్షన్ కూడా ఉంది. గతంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జై సింహా' టైమ్ లోనే, తన సినిమాలో విలన్ గా చేయమని బాలయ్య స్వయంగా రాజశేఖర్ ను అడిగారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రాజశేఖరే బయటపెట్టారు. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ కాంబో సెట్ అవ్వలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ అదే బాలయ్యకు ఎదురుగా రాజశేఖర్ పేరు వినిపిస్తుండటం, అది కూడా కొరటాల లాంటి బ్యాలెన్స్డ్ డైరెక్టర్ చేతిలో పడటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి.
రాజశేఖర్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, ఈమధ్య ఆయన కూడా కేవలం సోలో హీరో క్యారెక్టర్లకే స్టిక్ అవ్వకుండా, తన ఏజ్ కు సెట్ అయ్యే క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. రీసెంట్ గా 'బైకర్' సినిమాలో హీరో ఫాదర్ గా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొత్తదనమున్న పాత్రలు చేయాలనే ఆకలి ఆయనలో కనిపిస్తోంది. ఇలాంటి రైట్ టైమ్ లో కొరటాల నుంచి ఒక సాలిడ్ నెగెటివ్ రోల్ పడితే, రాజశేఖర్ ఖాతాలో కూడా జగపతిబాబు రేంజ్ లో ఒక ట్రెండ్ సెట్టింగ్ ఇమేజ్ పడటం గ్యారెంటీ.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇందుకోసం బాలయ్య సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారట. అయితే విలన్ గా రాజశేఖర్ పేరును మాత్రం మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.