ఇరుముడితో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్.. బేబీ నక్షత్ర తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?
టాలెంట్ ఉండి.. ఆ టాలెంట్ కు తగ్గట్టుగా మంచి పాత్ర పడిందంటే.. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీస్ అయిపోవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపిస్తున్నారు.
టాలెంట్ ఉండి.. ఆ టాలెంట్ కు తగ్గట్టుగా మంచి పాత్ర పడిందంటే.. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీస్ అయిపోవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపిస్తున్నారు. అయితే ఈ విషయం అటు చిన్నారులకు కూడా వర్తిస్తుంది అనే చెప్పాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది చిన్నారులున్నా ...అందులో ప్రత్యేకించి కొంతమంది.. సినిమాలకు ఊపిరి పోస్తూ ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోతున్నారు. రీసెంట్ కాలంలో అలా వచ్చిన చిన్నారుల్లో మొన్నటికి మొన్న రేవంత్ అలియాస్ బుల్లి రాజు ఎలా అయితే పేరు దక్కించుకున్నారో.. ఇప్పుడు మణెమ్మ పాత్రలో అందరి దృష్టిని ఆకట్టుకుంది బేబీ నక్షత్ర.
రీసెంట్గా వచ్చిన ఇరుముడి సినిమాలో రవితేజకి కూతురు పాత్రలో నటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రవితేజ కూతురిగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా ఈ చిన్నారి మలయాళం అయినప్పటికీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తెలుగు మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ నక్షత్ర పేరు వినిపిస్తుండడంతో నక్షత్రకి ఇరుముడి సినిమాలో ఎంత రెమ్యూనరేషన్ లభించింది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నక్షత్రను చూసి ఇరుముడి సినిమాలో అవకాశం కోసం నక్షత్ర తల్లిని సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ..ఇందులో ఆ పాపకు ఈ పాత్ర ఇచ్చినట్లు స్వయంగా నక్షత్ర చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ..ఈ సినిమాలో సోల్ లాంటి పాత్ర పోషించిన నక్షత్ర.. ఆ పాత్రకు తగ్గట్టుగానే సుమారుగా రూ.10 లక్షల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. మొదటి సినిమాతోనే ఈ రేంజ్ నటన కనబరిచి అంతే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది నక్షత్ర.
ఇకపోతే ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించిన నేపథ్యంలో.. ఈ చిన్నారికి వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇరుముడి సినిమా నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కూడా భవిష్యత్తులో నక్షత్రకి హీరోయిన్ గా అవ్వాలనే ఆలోచన ఉంటే కచ్చితంగా తమ బ్యానర్ ద్వారానే ఆమెను హీరోయిన్ ను చేస్తామని రవిశంకర్ ఇటీవల ఇరుముడి బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం నక్షత్ర ఒకవైపు వరుస అవకాశాలు అందుకుంటూ.. మరొకవైపు అంతే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది.