బాహుబలి 3 వస్తుందా? నిర్మాత మౌనం దేనికి సంకేతం?

అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా స్టేజ్‌పై లైట్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో సరదాగా సైలెంట్ మోమెంట్ క్రియేట్ చేయడం అక్కడున్న వారిని నవ్వించింది.

Update: 2026-07-13 10:06 GMT

బాహుబలి3 ఎప్పుడు వస్తుంది? గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సినీ అభిమానులు అత్యధికంగా అడుగుతున్న ప్రశ్నల్లో ఇదొకటి. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంచైజీ భారతీయ సినీ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయాన్ని రాసిన తర్వాత మూడో భాగంపై ఊహాగానాలు ఎప్పుడూ ఆగలేదు. తాజాగా జరిగిన ఓ విష‌యం ఈ డిస్క‌ష‌న్ ను మరోసారి హాట్ టాపిక్‌గా మార్చింది.

రీసెంట్ గా జరిగిన ఓ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కొడుకు కార్తికేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ డైరెక్ట్ గా బాహుబలి3 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంద‌ని ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా స్టేజ్‌పై లైట్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో సరదాగా సైలెంట్ మోమెంట్ క్రియేట్ చేయడం అక్కడున్న వారిని నవ్వించింది. కానీ ఆ మౌనం మాత్రం అభిమానుల్లో మరోసారి ఆసక్తిని పెంచింది. సమాధానం చెప్పకుండా దాటవేయడం వెనుక ఏదైనా ప్లానింగ్ ఉందా? లేక కేవలం సరదా కోసమే అలా చేశారా? అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది.

రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి: ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి పాల్గొన్న సంభాషణలో బాహుబలి ప్రపంచం ఇంకా కంటిన్యూ అవుతుంద‌నేలా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా స‌ర‌దా సంభాష‌ణ‌ మధ్య ప్రభాస్ మూడు వేళ్లు చూపిస్తూ చేసిన సైగ, రానా చేసిన కామెంట్స్ అభిమానుల్లో మూడో భాగంపై కొత్త ఆశలను రేకెత్తించాయి. చివర్లో కనిపించిన ది లెగసీ కంటిన్యూస్ అనే మెసేజ్ కూడా డిస్క‌ష‌న్ కు మరింత ఊతమిచ్చింది.

అయితే ఈ అన్ని పరిణామాల మధ్య ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బాహుబలి3 పై ఆడియ‌న్స్ లో ఎంతటి ఉత్సాహం ఉన్నా, ఇప్పటివరకు డైరెక్ట‌ర్ రాజమౌళి గానీ, నిర్మాత శోభు యార్లగడ్డ గానీ అఫీషియ‌ల్ గా బాహుబ‌లి మూడో భాగాన్ని అనౌన్స్ చేయ‌లేదు. తాజాగా స్టేజ్ పైన కూడా ఈ ప్రశ్నకు నిర్మాత రెస్పాండ్ అవ‌కుండా మౌనం పాటించడం కూడా ప‌లు అనుమానాల‌కు దారి తీస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి తన త‌ర్వాతి భారీ ప్రాజెక్టైన‌ వార‌ణాసితో బిజీగా ఉండగా, ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాహుబలి3 ఎప్పుడు ప్రారంభమవుతుంది? అది ఫుల్ లెంగ్త్ సినిమా రూపంలో వస్తుందా? లేక ఫ్రాంచైజీని విస్తరించే మరో ప్రత్యేక ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే క‌చ్ఛితంగా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది బాహుబలి పేరు వినిపించిన ప్రతిసారీ అభిమానుల్లో అదే ఉత్సాహం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు.

Tags:    

Similar News