ట్రెడిషనల్ లుక్‌లో అవికా గోర్.. రాయల్ అవతార్‌లో ఫ్యాన్స్ ఫిదా!
బుల్లితెర చిన్నారి ఆనందిగా అందరి హృదయాలను దోచుకుని, ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస హిట్లొతో స్టార్ హీరోయిన్‌గా మారిన అవికా గోర్ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బుల్లితెర చిన్నారి ఆనందిగా అందరి హృదయాలను దోచుకుని, ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస హిట్లొతో స్టార్ హీరోయిన్‌గా మారిన అవికా గోర్ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాయల్ ట్రెడిషనల్ లుక్‌లో రాజకుమారిలా మెరిసిపోతున్న ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాంప్రదాయ దుస్తుల్లో మోడ్రన్ టచ్ ఇస్తూ ఆమె ఇచ్చిన పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్లాసీ అవతార్ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
రాయల్ బ్రౌన్ వెల్వెట్ లెహంగాలో మెరుపులు:
ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్ కోసం అవికా గోర్ బ్రౌన్ కలర్ వెల్వెట్ లెహంగాను ఎంచుకున్నారు. దానికి మ్యాచింగ్‌గా బంగారు మరియు మల్టీ కలర్ వర్క్‌తో డిజైన్ చేసిన హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించారు. ఇక రాయల్ హెరిటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ ఫోటోలలో ఆమె ఎంతో రాజసంగా, కంటి రెప్ప వేయకుండా చూసేంత అందంగా కనిపిస్తోంది.
స్టైలింగ్, జ్యువెలరీకి నెటిజన్ల ప్రశంసలు:
అవికా ధరించిన రాయల్ జ్యువెలరీ, హెయిర్ అప్‌డో, మరియు ముఖంలో ఉన్న ప్రశాంతమైన హావభావాలు ఆమెకు క్లాసిక్ ఎలిగాన్స్‌ను తెచ్చిపెట్టాయి. ఈ రాయల్ అవతార్‌ను డిజైన్ చేసిన స్టైలిస్ట్ నిధి మునోత్ తో పాటు మేకప్, ఫొటోగ్రఫీ టీమ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిన్నారి ఆనంది నుంచి స్టార్ హీరోయిన్ వరకు:
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అవికా, 'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా సైమా అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజు గారి గది 3' వంటి వరుస హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
కంటెంట్ ఉన్న సినిమాలకే మొగ్గు:
హిందీలో '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్', 'బ్లడీ ఇష్క్' వంటి చిత్రాలతో పాటు 'పాప్‌కార్న్' అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించి తన టాలెంట్ చూపించింది. ఇక 2025లో వచ్చిన 'షణ్ముఖ' సినిమాతో అలరించిన ఆమె, 2026లో 'అగ్లీ స్టోరీ' అనే సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలతో పాటు రియాలిటీ షోస్ చేస్తూ నిరంతరం ట్రెండింగ్‌లో ఉంటోంది.
వ్యక్తిగత జీవితంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన అవికా గోర్, కెరీర్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మోడ్రన్ లుక్స్ తోనే కాకుండా, ఇలాంటి రాయల్ ట్రెడిషనల్ అవతార్‌లో కూడా తనే సాటి అని ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి నిరూపించింది.