హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ వారసుడిని చూసారా?
హాలీవుడ్ యాక్షన్ దిగ్గజం, బాడీబిల్డింగ్ ఐకాన్ ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ కండల తిరుగులేని రూపాన్ని.. ఫిట్‌నెస్ వారసత్వాన్ని ఆయన కుమారుడు జోసెఫ్ బాఏనా అద్భుతంగా కొనసాగిస్తున్నాడు.
హాలీవుడ్ యాక్షన్ దిగ్గజం, బాడీబిల్డింగ్ ఐకాన్ ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ కండల తిరుగులేని రూపాన్ని.. ఫిట్‌నెస్ వారసత్వాన్ని ఆయన కుమారుడు జోసెఫ్ బాఏనా అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. రూపురేఖల్లోనే కాకుండా శరీరసౌష్ఠవంలో కూడా అచ్చు గుద్దినట్లు తండ్రిలాగే ఉండే జోసెఫ్‌ను చూసి హాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. కేవలం ఆర్నాల్డ్ కొడుకుగానే కాకుండా.. తనదైన శైలిలో ఓల్డ్ స్కూల్ బాడీబిల్డింగ్ పద్ధతులు .. క్రమశిక్షణతో తండ్రికి తగ్గ వారసుడిగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్నాడు.
బాడీబిల్డింగ్ రంగంలోనే కాకుండా చదువులోనూ జోసెఫ్ మంచి విద్యార్హతలు సాధించాడు. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత పెప్పర్‌డైన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందాడు. కేవలం చదువుకే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా అర్హత సాధించి ఆ రంగంలోనూ రాణించాడు. అయితే రక్తంలోనే ఉన్న ఫిట్‌నెస్ .. గ్లామర్ రంగాలపై ఉన్న ఆసక్తితో తండ్రిలాగే బాడీబిల్డింగ్ , యాక్టింగ్ వైపు అడుగులు వేశాడు.
జోసెఫ్ బాఏనా కూడా నటుడే! తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హాలీవుడ్‌లో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. `లావా`, `కాలర్ డ్యూటీ`, `గన్ హ్యాండ్స్` వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం నటనలో శిక్షణ పొందుతూ.. స్వయంకృషితో అవకాశాలను అందుకుంటున్నాడు. తండ్రి పేరును వాడుకోకుండా సొంత కష్టంతో నటుడిగా నిలదొక్కుకోవాలనుకోవడం అతడిలోని నిబద్ధతకు నిదర్శనం.
ప్రస్తుతం మోడ్రన్ జిమ్‌లలో అనేక రకాల హైటెక్ మెషిన్లు అందుబాటులోకి వచ్చినా జోసెఫ్ తన తండ్రి ఆర్నాల్డ్ కాలం నాటి `ఓల్డ్ స్కూల్` వర్కవుట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాడు. పుల్-అప్స్.. T-బార్ రో.. హై కేబుల్ రో... సింగిల్-ఆర్మ్ పుల్‌డౌన్ వంటి క్లాసిక్ బ్యాక్ ఎక్సర్‌సైజ్‌ల తో విస్తృతమైన వీపు - క్లాసిక్ V-షేప్ ఫిజిక్‌ను ఎలా సాధించవచ్చో సోషల్ మీడియా ద్వారా నేటి తరానికి వివరిస్తున్నాడు. `మైండ్-మజిల్ కనెక్షన్` సూత్రంతో తండ్రి నాటి కండల రూపాన్ని రీక్రియేట్ చేస్తున్నాడు.
ఓవరాల్‌గా అతడు ట్యాలెంటెడ్ అని ప్రూఫ్ ఉంది. చదువు, బిజినెస్, బాడీబిల్డింగ్, నటన.. ఇలా అన్ని రంగాల్లోనూ జోసెఫ్ బాఏనా ప్రతిభ చూపుతున్నాడు. తండ్రి ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకుంటూనే.. తన సొంత కష్టంతో హాలీవుడ్‌లో ఒక యంగ్ యాక్షన్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. శరీరసౌష్ఠవం, నటన రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్న అతడి ప్రయాణం చూస్తుంటే.. కచ్చితంగా ఆర్నాల్డ్ స్థాయికి తగ్గ వారసుడిగా హాలీవుడ్‌లో తనదైన రికార్డులను తిరగరాస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.