అనుపమ హాట్ కామెంట్స్.. టార్గెట్ ఎవరు..?

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఎందుకో ఇంకా వెనకపడే ఉంది.;

Update: 2025-08-12 05:56 GMT

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఎందుకో ఇంకా వెనకపడే ఉంది. బహుశా ఆమె వ్యక్తపరిచే అభిప్రాయాల వల్ల ఆమెకు అవకాశాలు రావట్లేదా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ గా పరదా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో అనుపమ సినిమాకు తాను 7 గంటలకు వస్తే రెండున్నర గంటల తర్వాత అంటే 9:30 గంటలకు షాట్ రెడీ అంటారు. అలా రెండున్నర గంటల టైం ఎందుకు వేస్ట్ అని తను అడిగితే మాత్రం ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అనేస్తారు.

హీరోయిన్ కాకుండా వేరే వాళ్లు చేస్తే..

నేను కూడా సినిమా గురించే ఆలోచిస్తాను కదా.. ఈ రెండున్నర గంటల టైం లో సినిమాకు సంబందించిన థింగ్స్ ఎన్నో చేయొచ్చు. కో యాక్టర్ కోసం అన్ని గంటల టైం ఎందుకు వెయిట్ చేయాలి. ఇదే హీరోయిన్ కాకుండా వేరే వాళ్లు చేస్తే ఇలానే రియాక్ట్ అవుతారా వాళ్ల వెనకాలే కదా మాట్లాడేది. మరి హీరోయిన్స్ తో ఎందుకు వెంటనే ఆన్సర్ ఇస్తారంటూ అంటుంది అనుపమ పరమేశ్వరన్. తాను చేసిన కొన్ని సినిమాల షూటింగ్స్ లో తన అనుభవాలను చెబుతూ ఇలా రెండున్నర గంటలు హీరోయిన్ సెట్ లో వెయిట్ చేయాలంటూ చెప్పుకొచ్చింది.

అనుపమ పరమేశ్వరన్ ఇలా అడగడంలో తప్పులేదు కానీ సినిమా అంతే సమిష్టి కృషి. ఒకరిద్దరు కాస్త టైం అడ్జెస్ట్ చేసుకోక తప్పదు. ప్రతిసారి అలా జరిగితే కష్టమే కానీ ఏదో ఒకరోజు అలా రెండు మూడు గంటలు అనుకోకుండా వెయిట్ చేయాల్సి రావడం సినిమా షూటింగ్స్ లో కామనే. అనుపమ చెప్పిన ఈ పాయింట్ బహుశా అందరి హీరోయిన్స్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరు కావాలని హీరోయిన్ ని ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఐతే ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ల గురించి కచ్చితంగా హీరోయిన్స్ ఇలా ఇన్ డైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ ఎటాక్ కి సిద్ధమయ్యే రోజు కూడా వస్తుంది.

ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో..

ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే ప్రెజంట్ పరదాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనుపమ. ఈ సినిమా మీద అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. అనుపమ లీడ్ రోల్ లో నటించిన సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా బాధ్యత అంతా తన మీద వేసుకుంది అమ్మడు. సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టగా ఆగష్టు 22న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Tags:    

Similar News