అనిరుధ్ మ్యూజిక్‌లో భారీ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఆయన కోసమేనా?
టాలీవుడ్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న పౌరాణిక చిత్రం'గాడ్ ఆఫ్ వార్' పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు.
టాలీవుడ్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న పౌరాణిక చిత్రం'గాడ్ ఆఫ్ వార్' పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా ప్రకటన రాగానే అందరినీ ఆశ్చర్యపరిచిన ముఖ్యమైన విషయం అనిరుధ్ రవిచందర్ ఎంపిక. సాధారణంగా పాస్టెస్ట్ బీట్స్, వెస్ట్రన్ సౌండింగ్‌తో కుర్రకారును ఊపేసే అనిరుధ్.. మంత్రాలు, శ్లోకాలతో నిండి ఉండే ఒక పౌరాణిక కథకు ఎలాంటి సంగీతం ఇస్తాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.ఆ విశేషాలు చూద్దాం..
ఎలక్ట్రానిక్ వైబ్స్ నుంచి డివోషనల్ క్లాసిక్ వరకు:
అనిరుధ్ మ్యూజిక్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ డ్రమ్స్, సింథ్ మాస్ బీట్స్, హై-వోల్టేజ్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్. కానీ సుబ్రహ్మణ్య స్వామి పాత్ర నేపథ్యంతో సాగే పౌరాణిక కథకు ఇవేవీ సరిపోవు. ఇక్కడ మన ప్రాచీన ఇండియన్ క్లాసికల్ ఆర్కెస్ట్రా, శ్లోకాలు, వేద మంత్రాల ధ్వని చాలా ముఖ్యం. ఇక తమన్, దేవిశ్రీ లేదా పాత తరం సంగీత దర్శకులు సులువుగా హ్యాండిల్ చేసే ఈ జోనర్‌ను అనిరుధ్ ఎలా ఆవిష్కరిస్తారనేదే అసలైన సవాలు.
సరికొత్త మ్యూజికల్ బ్లెండ్:
నేటి తరం ఆడియన్స్ థియేటర్‌లో పూనకాలు తెప్పించే ఎలివేషన్లను కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ రాసే పవర్‌ఫుల్ పౌరాణిక సంభాషణలకు అనిరుధ్ తనదైన శైలిలో కాస్త మోడర్న్ టచ్ ఇస్తూనే, వేద మంత్రాలను బిజీఎమ్‌గా బ్లెండ్ చేస్తే ఆ అనుభూతి ఊహ కందని రీతిలో ఉంటుంది. ఇక భక్తి రసంతో పాటు యంగ్ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఆడియో ట్రాక్స్‌ను డిజైన్ చేయడం అనిరుధ్ మ్యాజిక్‌పై ఆధారపడి ఉంటుంది.
'దేవర' హిట్ కాంబో.. మరింత పెరిగిన బాధ్యత:
'దేవర' సినిమాలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఆ హిట్ కాంబినేషన్ ఇప్పుడు ఒక విజువల్ గ్రాండియర్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ చేతులు కలపడం వల్ల అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఇది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు, అనిరుధ్ కెరీర్‌లోనే ఒక గొప్ప మలుపుగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాతో ఆయన తనలోని పూర్తిస్థాయి వర్సటైలిటీని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు.
సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఇప్పటివరకు ఒక రకమైన స్టైల్‌తో లీగ్ లీడర్‌గా ఉన్నారు. కానీ 'గాడ్ ఆఫ్ వార్' లాంటి దైవిక కథకు స్వరాన్ని అందించడం అంటే అది ఆయన మ్యూజికల్ జర్నీలో అతిపెద్ద పరీక్ష మరియు గొప్ప అవకాశం. ఒకవేళ ఆయన ఈ సంప్రదాయ-ఆధునిక కలయికను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తే, సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్-ఇండియా వ్యాప్తంగా ఇండియన్ డివోషనల్ మ్యూజిక్ ట్రెండే మారిపోవడం ఖాయం.