వైట్ ఫ్రాక్ లో ఏంజెల్ లా మనసు దోచుకుంటున్న అమైరా!

అమైరా దస్తూర్..ఈ హీరోయిన్ కి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా గుర్తింపు లేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.;

Update: 2025-12-03 06:56 GMT

అమైరా దస్తూర్..ఈ హీరోయిన్ కి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా గుర్తింపు లేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది. అయితే అలాంటి అమైరా దస్తూర్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుకి మత్తెక్కిపోతోంది. తాజాగా అమైరా దస్తూర్ వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.



 


ఈ వైట్ కలర్ డ్రెస్ లో అమైరా దస్తూర్ అందాలకు చాలామంది ఫిదా అవుతున్నారు. తెలుపు రంగు డ్రెస్ లో పాలమీగడలాంటి అందంతో అమైరా దస్తూర్ అదుర్స్ అంటూ చాలామంది నెటిజన్స్ ఈ ఫోటోలకి కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు చాలామంది అమైరా దస్తూర్ షేర్ చేసిన ఫోటోలకు లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ తెలుపు రంగు డ్రెస్సులో చందమామలా మెరిసిపోతున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది వైట్ ఫ్రాక్ లో ఏంజెల్ లా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమైరా దస్తూర్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేయడమే కాకుండా ఆ ఫోటోలకు "స్త్రీతత్వం వికసించడం" అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం అమైరా దస్తూర్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.



 


అమైరా దస్తూర్ సినిమాలు,పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన అమైరా దస్తూర్ బాలీవుడ్లో 2013 లో వచ్చిన 'ఇసాక్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తమిళంలో వచ్చిన అనేగన్ అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. ఈ సినిమా తెలుగులో అనేకుడు అనే పేరుతో విడుదలైంది.అలా మిస్టర్.ఎక్స్, కుంగ్ ఫు యోగ, కాలకండి, రాజ్మా చావల్ , జడ్జిమెంటల్ హై క్యా, మేడ్ ఇన్ చైనా, ప్రస్థానం, కోయీ జానే నా వంటి హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్ లో ఫేమస్ అయింది.



 


అలాగే తెలుగులో మనసుకు నచ్చింది, రాజుగాడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. చివరిగా అమైరా దస్తూర్ తమిళంలో బఘిర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, ది ట్రిప్ -2,తాండవ్, డోంగ్రి టు దుబాయ్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.అలా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇంటర్ నెట్ లో కూడా యాక్టివ్ గా ఉంటుంది.



 


Tags:    

Similar News