'అమీర్ లోగ్' సాంగ్.. పక్కా గల్లీ వైబ్స్‌ తో బజ్ పెంచారుగా!

హైదరాబాద్ కల్చర్, లోకల్ యూత్ ఎనర్జీ, గల్లీ క్రికెట్ మజాను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతున్న అమీర్ లోగ్ సినిమా ఇప్పుడు తన పాటలతో సూపర్ హైప్ సృష్టిస్తోంది.

Update: 2026-07-17 04:33 GMT

హైదరాబాద్ కల్చర్, లోకల్ యూత్ ఎనర్జీ, గల్లీ క్రికెట్ మజాను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతున్న అమీర్ లోగ్ సినిమా ఇప్పుడు తన పాటలతో సూపర్ హైప్ సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన అవ్వల్ దావత్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ పొందగా.. తాజాగా విడుదలైన సీదా హెలికాప్టర్ షాట్ లిరికల్ వీడియో కూడా అదే జోష్‌ ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా గల్లీ కల్చర్‌ ను రిఫ్లెక్ట్ చేసే విజువల్స్, ర్యాప్ బీట్‌లు, లోకల్ లాంగ్వేజ్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

సినిమా ప్రమోషన్లలో పాటలు కీలక పాత్ర పోషించే ఈరోజుల్లో, అమీర్ లోగ్ టీమ్ కూడా అదే ప్లాన్ ఫాలో అవుతోంది. ఒకవైపు మాస్ బీట్‌లతో ఆకట్టుకునే అవ్వల్ దావత్, మరోవైపు యూత్ కు దగ్గరగా ఉండే ర్యాప్ స్టైల్‌ లో వచ్చిన సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆ పాటలో కనిపించే హైదరాబాద్ వీధుల వాతావరణం, గల్లీ క్రికెట్ మూడ్, యువత లైఫ్ స్టైల్ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి.

ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్న స్మరణ్ సాయి యూత్ టేస్ట్ కు తగ్గట్టుగా బీట్‌ లను రూపొందించారని సాంగ్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఎంసీ హరి రాసి, పాడిన ర్యాప్ ట్రాక్‌ లు సినిమాకు ఒక ప్రత్యేక ఫ్లేవర్‌ ను తీసుకొచ్చాయి. సాధారణ కమర్షియల్ పాటల కంటే లోకల్ టచ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సాంగ్స్ సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. అదే తరహాలో అమీర్ లోగ్ కూడా లోకల్ కల్చర్ ను మెయిన్ ఎలిమెంట్ గా ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా గల్లీల్లో పెరిగిన యువత, వారి డ్రీమ్స్, ఫ్రెండ్ షిప్స్, సరదా సంఘటనలు ఎంటర్టైనింగ్ చూపించబోతున్నట్లు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చెబుతోంది.

ఇంకా ఆసక్తికర అంశం ఏమిటంటే.. సినిమా కంటెంట్‌ చూసిన తర్వాత ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పిరిట్ మీడియా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం. ఇది కూడా చిత్రంపై ఆడియన్స్ లో కొంత ఆసక్తిని పెంచింది. చిన్న సినిమాగా ప్రారంభమైనా, విడుదలకు ముందే పాటలు, పోస్టర్లు, టీజర్‌ తో చర్చలోకి రావడం మేకర్స్‌ కు ప్లస్‌ గా మారుతోంది.

ప్రస్తుతం చూస్తుంటే అమీర్ లోగ్ కేవలం కామెడీ ఎంటర్టైనర్‌ గా కాకుండా, హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్‌ ను చూపించే చిత్రంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్ తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో మరింత చర్చ మొదలైంది. ఆగస్టులో విడుదల కానున్న ఆ సినిమా, పాటలతో వచ్చిన బజ్‌ ను బాక్సాఫీస్ వరకు తీసుకెళ్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



Full View


Tags:    

Similar News