అరియానా పై లైవ్ లో ఫైర్ అయిన అమీర్ లోగ్ యాక్టర్!

ఇక అందుకే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2026-08-19 04:56 GMT

సినిమా చిన్నదైనా.. పెద్దదైనా.. దానిని ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలి అంటే ప్రమోషన్స్ చాలా ముఖ్యం. అందుకే రాజమౌళి, సుకుమార్, అనిల్ రావిపూడి లాంటి హీరోలు తమ సినిమాను విడుదల చేస్తున్నాం అనడం కంటే సినిమా మొదలుపెట్టిన రోజు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాలపై భారీ అంచనాలను పెంచేస్తూ ఉంటారు. అంతేకాదు సినిమా నుంచి చిన్న చిన్న అప్డేట్లు వదులుతూ క్యూరియాసిటీ భారీగా పెంచేసి భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇక అందుకే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్లను మొదలుకొని స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు అలాగే తమ వ్యక్తిగత విషయాలను కూడా బయట పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు చేసే ప్రమోషన్ స్టంట్స్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా అమీర్ లోగ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే అమీర్ లోగ్ చిత్ర బృందాన్ని ప్రముఖ యాంకర్ అరియానా గ్లోరీ స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అయితే ఇందులో మాట్లాడుతుండగానే ఈ సినిమా నటుడు అరియానా గ్లోరీ పై ఒక్కసారిగా మండిపడ్డారు.

ఏం ప్రశ్నలండి ఇవి.. నాకు అర్థం కావడం లేదు.. ఉదయం నుండి ఇవే ప్రశ్నలతో చావ దొబ్బుతున్నారు. ఒక రెండు మూడు ప్రశ్నలు ఎక్స్ట్రా తీసుకురావచ్చు కదా.. అందరినీ అడిగిన ప్రశ్నలే మమ్మల్ని కూడా అడుగుతున్నారు. సినిమా ఏందీ ? పేరేంది? మీ పర్సనల్స్ ఏంటి ?ఇవే అడుగుతున్నారు. ఏదైనా మంచిగా అడగండి అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అరియానా గ్లోరీ ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ఎంత ధైర్యం నీకు ఒక అరగంట ఇచ్చి.. 20 నిమిషాల్లో ఇంతకు మించి ఏం అడుగుతారు.. కొత్తది కొత్తది అంటే వైరల్ అవ్వడానికి ఇంకెన్ని ప్రశ్నలు కావాలి అంటూ ఫైర్ అయ్యింది. దానికి అమీర్ లోగ్ నటుడు నా పని ఏంటండీ సినిమా.. మీ పని క్వశ్చన్లు అడగడం.. మీరు నన్ను నా పని అడిగితే ఎలా కుదురుతుంది అంటూ వాయిస్ రైజ్ చేయగానే అక్కడున్న మిగతా నటులు ఇది అసలు ఇంటర్వ్యూ అంటే.. ఇప్పుడు పడుతుంది వైరల్ అంటూ సరదాగా నవ్వేశారు. ఇక దీంతో కాస్త హర్ట్ అయిన అరియానా ఇది మళ్ళీ ఓవర్గా ఉంది అంటూ కామెంట్ చేసింది. అలా మొత్తానికైతే ప్రమోషన్ స్టంట్ చేసి వార్తల్లో నిలిచారు అమీర్ లోగ్ నటుడు.



Tags:    

Similar News