వేర్ ఈజ్ AA? స్నేహారెడ్డి పోస్ట్‌పై ఫ్యాన్స్ కలకలం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తరచూ తన కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోగ్రాఫ్స్ అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన ఫోటోషూట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ``నా హృదయాన్ని నింపే ఆ చిన్నారి ప్రాణాలు.. ఇది నిజమైన `ఇల్లు` అనే భావనను కలిగించే ఆ చిన్నారి పాదాలు..`` అనే క్యాప్షన్‌తో స్నేహ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు అల్లు అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ అందమైన ఫోటోషూట్‌లో అల్లు వారసులు అల్లు అయాన్, అల్లు అర్హ ఎంతో క్యూట్‌గా తమ పెంపుడు పప్పీలతో ఆడుకుంటూ కనిపించారు. పిల్లల అమాయకత్వం.. పెంపుడు జంతువులతో వారి అనుబంధం నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు స్నేహారెడ్డి కూడా పెట్‌తో కలిసి సోలో స్టిల్‌లో ఎంతో లవ్లీగా గ్రేస్‌ఫుల్‌గా కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ఫోటోలకు ఉపాసన కామినేని కొణిదెలతో పాటు IIFA ఉత్సవ్ వంటి ప్రముఖ ప్రొఫైల్స్ కూడా హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరిచాయి.
అయితే ఈ సుందరమైన ఫ్యామిలీ ఫోటోషూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం అభిమానుల్లో కాస్త నిరాశను, మరికొంత కుతూహలాన్ని నింపింది. దీంతో కామెంట్ బాక్స్ మొత్తం ``వేర్ ఈజ్ AA?``, ``భాయ్ లేడేంటి మేడమ్?`` అంటూ ఫ్యాన్స్ వేసే ప్రశ్నలతో నిండిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ RAAKA (రాకా) షూటింగ్‌లో రాత్రింబవళ్లు బిజీగా ఉండటం వల్లే ఈ ఫోటోషూట్‌కు హాజరు కాలేకపోయారని అభిమానులు గెస్ చేస్తున్నారు.
ఇక ఈ పోస్ట్ కామెంట్ సెక్షన్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అల్లు అయాన్‌ను ఉద్దేశించి ఫ్యాన్స్ సరదాగా చేసిన కామెంట్స్ నవ్వులు పూయిస్తున్నాయి.``హేయ్ అయాన్.. మీ నాన్న ఎలాగూ హైదరాబాద్‌లో లేరు కదా.. గేమ్‌లు ఆడుకుంటానని చెప్పి డాడీ ఫోన్ తీసుకుని RAAKA సినిమాకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియో క్లిప్స్ ఏవైనా ఉంటే లీక్ చేయి!`` అంటూ ఫ్యాన్స్ సరదాగా అడుగుతున్నారు. వదినగారూ, అన్నయ్యను ఎలాగైనా `రాకా` అప్‌డేట్ ఇవ్వమని చెప్పండి అంటూ వేడుకుంటున్నారు.
మొత్తానికి అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఒకవైపు పిల్లలు, పెట్స్‌తో ఉన్న క్యూట్ స్టిల్స్ మనసును హత్తుకుంటుంటే.. మరోవైపు అభిమానుల ఫన్నీ కామెంట్స్... అల్లు అర్జున్ `రాకా` సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ఈ పోస్ట్‌ను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమాభిమానాలతో కామెంట్ సెక్షన్ లవ్, ఫైర్ ఎమోజీలతో నిండిపోయి సందడిగా కనిపిస్తోంది.