బన్నీ ధరించిన ఈ రిస్ట్ వాచ్ ధర అన్ని కోట్లా!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్, క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన ఏం చేసినా, ఎలాంటి బట్టలు వేసినా అది క్షణాల్లో ట్రెండ్ అయిపోతుంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్, క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన ఏం చేసినా, ఎలాంటి బట్టలు వేసినా అది క్షణాల్లో ట్రెండ్ అయిపోతుంది. ఇటీవల ఆర్‌సీబీ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను బన్నీ కలిసినప్పుడు దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే అందరి దృష్టి ఆయన వేసుకున్న లగ్జరీ వాచ్‌పై పడింది. ఆ వాచ్ ధర వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆ విశేషాలు చూద్దాం..
సోషల్ మీడియాలో హాట్ టాపిక్:
క్రికెట్, సినిమా స్టార్ల కలయిక ఎప్పుడూ అభిమానులకు పండగే. వెంకటేష్ అయ్యర్ అల్లు అర్జున్ కొడుకు అయాన్‌కు ఆర్‌సీబీ జెర్సీని గిఫ్ట్‌గా ఇవ్వగా, బన్నీ ఆయనకు బెస్ట్ విషెస్ చెప్పారు.ఇక ఈ ఫొటోలు నెట్‌లో వైరల్ అవ్వడమే ఆలస్యం, నెటిజన్లు బన్నీ చేతికి ఉన్న వాచ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
వాచ్ బ్రాండ్, ప్రత్యేకత ఇదే:
బన్నీ ధరించిన ఆ లగ్జరీ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత 'పాటెక్ ఫిలిప్' కంపెనీకి చెందిన 'నాటిలస్ మూన్‌ఫేస్ రోజ్ గోల్డ్'. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైన ఈ వాచ్ మార్కెట్ విలువ దాదాపు రూ.2.75 కోట్లు ఉంటుందని అంచనా.
భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు:
ఈ రేటు చూసి ఫ్యాన్స్ అంతా 'ఇది సార్ బన్నీ రేంజ్' అంటూ కాలర్ ఎగరేస్తుంటే, మరికొందరు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. "ఇంత డబ్బుతో హైదరాబాద్‌లో ఒక లగ్జరీ ఫ్లాట్ కొనొచ్చు" అని కొందరు, "ఒక చిన్న కుటుంబం జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు" అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
బన్నీ లగ్జరీ కలెక్షన్:
అల్లు అర్జున్‌కు వాచీలంటే చాలా ఇష్టమట. ఆయన దగ్గర కేవలం ఈ ఒక్కటే కాదు.. కార్టియర్, బ్రైట్లింగ్ వంటి మరెన్నో అంతర్జాతీయ టాప్ బ్రాండ్ల లగ్జరీ వాచ్ కలెక్షన్ కూడా ఉందని టాక్.
భారీ హైప్‌తో ‘రాకా’ :
ప్రస్తుతం అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమాపై ఎన్నో అంచనాలు వున్నాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసింది.
స్టార్ హీరోల లైఫ్ స్టైల్ ఎప్పుడూ లగ్జరీగానే ఉంటుంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఐకాన్ స్టార్ రేంజ్‌కు ఈ వాచ్ సరిగ్గా సరిపోతుందని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.ఇక ఏదేమైనా బన్నీ స్టైల్, ఆయన లగ్జరీ వాచ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచాయి.