లోకేష్ కనగరాజ్ - అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -మాస్టర్ క్రాఫ్ట్‌మెన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `AA23` లాక్ అయిన సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -మాస్టర్ క్రాఫ్ట్‌మెన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `AA23` లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ కు వెళ్తుందా? అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. లుక్ టెస్ట్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. లుక్ టెస్ట్ అప్డేట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. లుక్ టెస్ట్ షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఎన్నడు లేని విధంగా కొత్త లుక్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హీరోలను అత్యంత పవర్‌ఫుల్ అండ్ వైల్డ్ గా చూపిస్తారనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో బన్నీని ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ లుక్ టెస్ట్ ప్రక్రియే సినిమా మేకింగ్‌లో ఓ కొత్త ఒరవడిని సూచిస్తోంది. ఈ షూటింగ్ సెట్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు హై-లెవల్‌లో ఉంటాయి. సెట్స్‌లో అల్లు అర్జున్- దర్శకుడి మధ్య ఉన్న సమన్వయం.. సెట్టింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? అనేది బీటీఎస్ ద్వారా తెలిసే అవకాశం ఉంది.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వేచి చూస్తోన్న ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ కానుంది. `పుష్ప 2`తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ లోకేష్ యూనివర్స్‌లోకి అడుగుపెడుతుండటం అనేదే సంచలన నిర్ణయం. ఈ చిత్రం కమర్షియల్ హంగులతో పాటు, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుంది. లోకేష్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌ను బన్నీ స్టైల్‌తో కలిపి బాక్సాఫీస్ వద్ద మరో మాస్టర్ పీస్ ను అందించడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ .. బన్నీ మేనరిజమ్స్ కలిసి ప్రేక్షకులకు వినూత్నమైన సినిమా అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి.
ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో `రాకా`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందన్నది సమాచారం. ఈలోపే బన్నీ షెడ్యూల్ పూర్తి చేసుకుని రిలీవ్ అవుతాడు. ఈనేపథ్యంలోనే లోకేష్ సర్వం సిద్దం చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే సెట్స్ కు వెళ్లే లోపు ఒక్కో అప్ డేట్ వదులుతున్నారు.