క్రీడారంగంలో నారీ శక్తికి బాలీవుడ్ సెల్యూట్!

చలనచిత్ర రంగానికి- క్రీడారంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశంగర్వించదగ్గ రీతిలో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో బాలీవుడ్ ప్రముఖులు ఎల్లప్పుడూ ముందుంటారు

Update: 2026-06-06 03:15 GMT

చలనచిత్ర రంగానికి- క్రీడారంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశంగర్వించదగ్గ రీతిలో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో బాలీవుడ్ ప్రముఖులు ఎల్లప్పుడూ ముందుంటారు. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు ప‌ని తీరుపై బాలీవుడ్ నటీమణులు అలియా భట్ - శర్వరీ వాఘ్ జట్టుకు ప్రత్యేక మద్దతును ప్రకటించారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారు పంచుకున్న సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్- వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నేతృత్వంలో మైదానంలోకి అడుగుపెడుతున్న వేళ నటీమణులు వారిని ఎంతగానో కొనియాడారు.

అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను నలుదిశలా చాటుతున్న మహిళా క్రికెటర్ల ఆటతీరు ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు జట్టులోని ప్రతి ఒక్క క్రీడాకారిణిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేలా సెలబ్రిటీల నుండి వ‌చ్చే ప్రశంసలు .. శుభాకాంక్షలు ఎంతగానో తోడ్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మద్దతు కేవలం సాధారణ శుభాకాంక్షలకే పరిమితం కాలేదు. అలియా భట్, శర్వరీ వాఘ్ ఇద్దరూ ప్రస్తుతం వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న మొట్టమొదటి మహిళా ప్రధాన యాక్షన్ చిత్రం `ఆల్ఫా` లో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో వారు దేశాన్ని రక్షించే పవర్‌ఫుల్ ఏజెంట్లుగా కనిపించనున్నారు. రీల్‌ లైఫ్‌లో తాము నారీ శక్తిని ప్రతిబింబించే పాత్రలు పోషిస్తున్న తరుణంలో రియల్ లైఫ్‌లో దేశం కోసం పోరాడుతున్న మహిళా క్రికెటర్లను అభినందించడం అద్భుతమైన కాంబినేషన్‌గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత ఉన్న చలనచిత్రాలు విడుదలవుతున్న తరుణంలో? ఇలాంటి నిజ జీవిత మహిళా సాధకులను ప్రోత్సహించడం వల్ల అటు క్రీడారంగానికి, ఇటు సినిమా రంగానికి పరస్పర ప్రయోజనం చేకూరుతుంది.

అలియా, శర్వరీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా భారత జెండా ఎమోజీలను జోడిస్తూ `గో గర్ల్స్, కీప్ మేకింగ్ అస్ ప్రౌడ్ అంటూ రాసుకొచ్చారు. ఈ డిజిటల్ సంఘీభావం క్రీడాకారిణుల నైతిక బలాన్ని మరింత పెంచుతుంద నడంలో సందేహం లేదు. ప్రస్తుత ఆధునిక కాలంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళా క్రికెట్‌కు కూడా ప్రేక్షకాదరణ .. బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ఐకాన్స్ లీగ్ మ్యాచ్‌ల ద్వారా అంతర్జాతీయ సిరీస్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నటీమణుల మద్దతు లభించడం.. సమాజంలో మహిళా క్రీడలపై ఉన్న ఆసక్తిని .. గౌరవాన్ని మరింత పటిష్టం చేయడానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News