ఇండ‌స్ట్రీలో మ‌రో వేట‌గాడు..సెంచ‌రీ కూడా కొడ‌తారా?

ఐకానిక్ కాంబినేషన్‌గా పేరుగాంచిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ -దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్‌ల క్రేజీ కాంబో మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Update: 2026-09-01 06:30 GMT

ఐకానిక్ కాంబినేషన్‌గా పేరుగాంచిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ -దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్‌ల క్రేజీ కాంబో మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇదే ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో అల‌రిస్తున్నారు. ఇప్ప‌టికీ రిలీజ్ అయిన 'బూత్ బంగ్లా' మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో

'హైవాన్' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో ప్రాజెక్ట్ కు చేతులు క‌లుపుతున్నారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఇది తొమ్మిద‌వ చిత్రం కావ‌డం విశేషం. ఈ కొత్త కామెడీ-థ్రిల్లర్ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్ వినూత్నమైన వేటగాడి పాత్రలో క‌నిపించ‌నున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ కెరీర్‌లో ఇది 99వ చిత్రం కావడం మ‌రో విశేషం. ఈ సినిమా పాత్ర గురించి ప్రియదర్శన్ మాట్లాడుతూ 'ఈసారి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అనుభూతిని అందించబోతున్నాం. అక్షయ్‌ను వైవిధ్యమైన హంటర్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నాను' అని తెలిపారు. అయితే ఈ పాత్ర కథలో ఎలా కీలకం కానుంది? కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు ఏ విధంగా తోడ్పడుతుందనే ఇతర వివరాలను మేకర్స్ సస్పెన్స్‌గానే ఉంచారు.

ఈ సినిమాకు తాత్కాలికంగా 'వికెడ్ సన్నీ' అనే టైటిల్‌ను ప్రచారంలో ఉన్నా? చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తౌరానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబినేషన్‌కు ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన చరిత్ర ఉంది.

'హేరా ఫేరి', 'గరం మసాలా', 'భాగం భాగ్', 'భూల్ భులయా', 'దే దనా దన్', 'ఖట్టా మీఠా' వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ కల్ట్ కామెడీ చిత్రాలు ఇద్ద‌రి కలయికలో వ‌చ్చిన‌వే. సుదీర్ఘ విరామం తర్వాత ఇద్ద‌రు మళ్లీ 'భూత్ బంగ్లా' , 'హైవాన్' చిత్రాల కోసం ఇదే ఏడాది చేతులు క‌లిపారు. తాజాగా తెర‌కెక్క‌నున్న 9వ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ప్రియ ద‌ర్శ‌న్ 100వ సినిమా కూడా ఇదే కాంబినేష‌న్ లో తెర‌కెక్కితే బాగుంటుంద‌ని అభిమానులు ఆశీస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు క‌లిసి తొమ్మిది సినిమాలు చేసిన నేప‌థ్యంలో ల్యాండ్ మార్క్ 100వ చిత్రం...ఇద్ద‌రి కాంబినేష‌న్ 10వ చిత్రం కూడా అవుతుంది. క్రేజీ కాంబినేష‌న్ ఆ దిశ‌గా కూడా ఆలోచ‌న చేయాల‌ని నెటి జ‌నులు కోరుతున్నారు.

Tags:    

Similar News