స్పెష‌ల్: కొత్త పెళ్లి కూతురు బుగ్గ‌ల నిండుగా ముద్దులు!

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లతో పాటు, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ కొత్త దంపతులకు తమ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. దీంతో ఆకాంక్ష ఇన్ స్టా కామెంట్ సెక్షన్ అంతా జాత‌ర‌ను తలపిస్తోంది.

Update: 2026-07-19 07:54 GMT

బాలీవుడ్ నటి, మోడల్ ఆకాంక్ష రంజన్ కపూర్ ఇటీవ‌లే పెళ్లి బంధంతో ఓ ఇంటి కోడ‌లు అయిన సంగ‌తి తెలిసిందే. తన వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం షేర్ చేసారు ఆకాంక్ష‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిన్ డాట్‌ అని టైప్ చేసి ల‌వ్ ఈమోజీని జోడించారు.. ఆకాంక్ష‌ షేర్ చేసిన వెడ్డింగ్ - రిసెప్షన్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లతో పాటు, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ కొత్త దంపతులకు తమ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. దీంతో ఆకాంక్ష ఇన్ స్టా కామెంట్ సెక్షన్ అంతా జాత‌ర‌ను తలపిస్తోంది.



 


ఈ ఇన్‌స్టా పోస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఆకాంక్ష జిగిరీ దోస్త్- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన క్రేజీ కామెంట్. ఆకాంక్ష రంజన్‌కు అలియా భట్ చిన్ననాటి నుండి అత్యంత ఆప్తురాలు (బెస్ట్ ఫ్రెండ్) అనే సంగతి తెలిసిందే. తన ప్రాణస్నేహితురాలి పెళ్లి లుక్‌పై అలియా స్పందిస్తూ.. బేబ్ ఆఫ్ ది ఫోయ‌ర్! అంటూ కామెంట్ పెట్టి, ఫైర్ ఎమోజీని జోడించింది. రిసెప్షన్ ఎంట్రన్స్ వద్ద ఆకాంక్ష మెరిసిపోతున్న తీరును అభినందిస్తూ అలియా పెట్టిన ఈ కామెంట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.



 


ఇక నెటిజన్లు ఆకాంక్షను త‌ను న‌టించిన‌ పాపులర్ వెబ్ సిరీస్ పాత్రతో గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ `మోనికా, ఓ మై డార్లింగ్`లో ఆకాంక్ష `డాక్టర్ గార్గి` పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ పాత్రను మనసులో ఉంచుకుని ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్‌లో `డాక్టర్ గార్గి కా వివాహ్` (డాక్టర్ గార్గి పెళ్లి) అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఆ సిరీస్‌లోని పీహెచ్‌సీ డాక్టర్ల మీమ్స్‌ను ప్రస్తావిస్తూ ఫన్నీగా రియాక్ట్ అవుతుండటం విశేషం.



 


ఈ వేడుక క్షణాల్లో ఆకాంక్ష‌ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కూడా తమ ప్రేమను కురిపించారు. ఆకాంక్ష సోదరి అనుష్క రంజన్ ఈ పోస్ట్‌కు ల‌వ్ రే! అని ఎంతో ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వగా... ప్రముఖ మోడల్ సగీనా శర్మ జస్ట్ టూ గుడ్.. హ్యాపీ వ‌న్ వీక్! అంటూ పెళ్లయి అప్పుడే వారం రోజులు విజయవంతంగా పూర్తయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హార్ట్, ఫైర్ ఎమోజీలతో కొత్త జంటపై ప్రశంసల వర్షం కురిపించారు.



 


సెలబ్రిటీల పోస్టుల కింద వచ్చే కొన్ని విచిత్రమైన, గాసిప్ కామెంట్లు ఈ పోస్ట్ కింద కూడా దర్శనమిచ్చాయి. కొందరు నెటిజన్లు ఆకాంక్ష లుక్‌ను చూసి నోరా ఫతేహి అనుకున్నామని కామెంట్ చేయగా... మరికొందరు ``నువ్వు గర్భవతివా?`` అంటూ ప్రెగ్నెన్సీ రూమర్లను లేవనెత్తారు. అలాగే అలియా భట్‌తో ఈ మధ్య కాలంలో దూరం పెరిగిందా? అంటూ కొందరు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ఏదేమైనా.. విమర్శలు, ప్రశంసలు, సరదా కామెంట్ల నడుమ ఆకాంక్ష రంజన్ కపూర్ పెళ్లి వేడుక‌ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ ఆకాంక్ష పెళ్లి త‌ర్వాతా న‌టిస్తుందా లేదా? అనే ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.



 


Tags:    

Similar News