టాలీవుడ్-కోలీవుడ్ ప్రేమ్ అదిరిపోయే కాంబినేష‌న్!

తాజాగా తొలిసారిగా ఓ కోలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటే? ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2026-08-11 06:12 GMT

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్న అగ్ర హీరోలు కలిసి నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ - కోలీవుడ్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అభిమానులకు పండుగలాంటి అనుభూతే. అయితే కెరీర్ ఆరంభంలో `కందుకొండైన్ కందుకొండైన్`, `ఉల్లాసమ్` వంటి కొన్ని చిత్రాలలో ఇతర నటులతో కలిసి చేసిన త‌ల అజిత్ ఆ తర్వాత మాత్రం పూర్తిగా సోలో హీరో ఇమేజ్‌కే కట్టుబడిపోయారు. ఇతర స్టార్లతో కలిసి నటించడానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో దాదాపు 13 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్రేజీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న `డేర్ డెవిల్` (వర్కింగ్ టైటిల్) చిత్రంలో అత్యంత కీలకమైన ..శక్తివంతమైన పాత్రలో నటించడానికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంగీకరించినట్లు ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ గనుక అధికారికంగా పట్టాలెక్కితే టాలీవుడ్ -కోలీవుడ్ కలయికలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటిగా నిలవనుంది.

వెంకటేష్‌కి మల్టీస్టారర్ సినిమాలు కొత్తేం కాదనే విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ తో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, పవన్ కళ్యాణ్‌తో `గోపాల గోపాల`, వరుణ్ తేజ్‌తో `ఎఫ్ 2`, `ఎఫ్ 3` వంటి విజయవంతమైన మల్టీస్టారర్ చిత్రాలు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. విభిన్న కథాంశాలతో ఏ హీరోతోనైనా ఇమిడిపోయే వెంకీ నటన శైలి పరిశ్రమలో ఎంతో మందికి ఆదర్శం. తాజాగా తొలిసారిగా ఓ కోలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటే? ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్ర‌స్తుతానికి చిన్న పాత్రగానే ప్రచారం జ‌రుగుతున్నా? కథా ప్రాధాన్యతను బట్టి ఇది పూర్తి స్థాయి మల్టీస్టారర్‌గా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అజిత్ మాస్ ఇమేజ్, వెంకటేష్ క్లాస్ అండ్ మాస్ అప్పీల్ కలిసి వస్తే స్క్రీన్‌పై ఆ విజువల్స్ ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవడమే అద్భుతం. ఇద్దరు దిగ్గజాలు ఒక్కచోట చేరితే ఆ సినిమా రేంజ్ ఒక్కసారిగా పాన్-ఇండియా స్థాయిలో మారిపో తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వ్యాపారపరంగా కూడా ఈ కాంబినేషన్ టాలీవుడ్ - కోలీవుడ్ మార్కెట్లను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ క్రేజ్, తమిళనాడులో అజిత్ బాక్సాఫీస్ స్టామినా కలిసి పనిచేస్తే కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయం. నిర్మాతలు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది.

అంతిమంగా సుదీర్ఘ కాలం పాటు సోలో సినిమాలతోనే ప్రయాణం సాగించిన అజిత్- వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ సరికొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో? చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News