కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యరాయ్.. ఈమె ధరించిన గౌన్ తయారీకి ఎంత టైమ్ పట్టిందంటే?

భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి సెలబ్రిటీలు ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-05-23 05:11 GMT

భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి సెలబ్రిటీలు ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా క్రేజ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్క మంచి పాత్ర పడితే చాలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అయితే అలా వచ్చిన గుర్తింపుని ఈ నటీమణులు ఏకంగా అంతర్జాతీయ వేదికగా ఉపయోగించుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా పలు ఫ్యాషన్ వీక్స్ లో సందడి చేయడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఫిలిం ఫెస్టివల్స్ లో సందడి చేస్తూ మెప్పిస్తున్నారు. అంతేకాదు విభిన్నమైన వస్త్రధారణలతో.. అందర్నీ ఆశ్చర్యపరిచే ఆభరణాలతో.. వస్తువులతో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే తాజాగా 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.




ఈ రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ ను మొదలుకొని టాలీవుడ్ వరకు ఎంతోమంది సెలబ్రిటీలు వినూత్నమైన వస్త్రధారణలతో దర్శనమిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మిస్ యూనివర్స్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన వస్త్రధారణతో చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా తన డ్రస్ తయారీకి పట్టిన సమయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..




79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెడ్ కార్పెట్ పై లుమినారా పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన అబిస్ బ్లూ గౌను ధరించింది. అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ కస్టమ్ కౌచర్ పీస్ గౌన్ తయారీకి సుమారుగా 1500 గంటలకు పైగా సమయం పట్టినట్లు సమాచారం. క్రిస్టల్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఈ బ్లూ కలర్ గౌను అందరిని చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె భుజాల వద్ద రెక్కల లాంటి లోహపు డిజైన్ తో మత్స్యకన్య ను తలపించేలా చాలా అద్భుతంగా ఈ గౌను డిజైన్ చేశారు. అంతేకాదు ఈ సిల్హౌట్ గౌను కి చేతులపై నల్లటి దుపట్టా తో తన అలంకరణను ఫుల్ ఫిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ లుక్కును మోహిత్ రాయ్ స్టైల్ చేయగా.. ప్రముఖ జువెలరీ బ్రాండ్ డిజైన్ చేసిన బ్లూ చౌకర్ ను అలాగే ఉంగరాలను ధరించి ఆకట్టుకుంది.




ఏది ఏమైనా మిస్ యూనివర్స్ మరొకసారి కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచి హొయలు పోయింది.ఈమె సినిమా కెరియర్ విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది.

ఇకపోతే ఐశ్వర్యారాయ్ మాత్రమే కాదు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనింది. అంతేకాదు తన తల్లితో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచి అందరిని ఆకట్టుకుంది.

Tags:    

Similar News