ఆదిత్య కోసం మెగా హీరోలు క‌ర్చీప్!

`ఉరి`, `ధురందర్` విజయాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న‌ దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల హాట్ ఫేవరెట్‌గా మారారు;

Update: 2026-04-09 02:30 GMT

`ఉరి`, `ధురందర్` విజయాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న‌ దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల హాట్ ఫేవరెట్‌గా మారారు. ముఖ్యంగా మెగా కాంపౌండ్ హీరోలు ఆయనతో కలిసి పని చేసేం దుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదిత్య ధర్కు ట‌చ్ లో కి వెళ్లాడు. త‌న పాన్ ఇండియా ఇమేజ్ ను రెట్టింపు చేసే డైరెక్ట‌ర్ ఆదిత్య మాత్ర‌మేన‌ని న‌మ్మి అత‌డితో మంత‌నాలు జ‌రుపుతున్నాడు. అన్నీ కుదిరితే ఇద్ద‌రి కలయికలో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా ఈ రేసులోకి రావడం విశేషం.`ఆర్ ఆర్ ఆర్` తర్వాత చ‌ర‌ణ్ గ్లోబల్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా అనంత‌రం సుకుమార్ తో ఆర్సీ 17 ప‌ట్టాలెక్కుతుంది. ఇంత వ‌ర‌కూ చ‌ర‌ణ్ లైన‌ప్ క్లియ‌ర్ గా ఉంది. అనంత‌రం `ఆదిత్య ధ‌ర్` తోనే సినిమా చేసేందుకు అడుగులు వేస్తున్నాడని వార్త‌లొస్తున్నాయి. భారీ స్పోర్ట్స్ డ్రామా లేదా హిస్టారికల్ ఎపిక్ కోసం చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లు వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆదిత్య‌కు చ‌ర‌ణ్ కూడా ట‌చ్ లో ఉంటున్నాడు? అన్న‌ది ప్రాధ‌మిక స‌మాచారం. ఇలా మెగా హీరోలు ఇద్దరూ ఒకే దర్శకుడి కోసం ఆసక్తి చూపడం అనేది ఆదిత్య ధర్ ప్రతిభకు నిదర్శనం. ఒకవైపు బన్నీకి ఉన్న స్టైల్ అండ్ స్వాగ్, మరోవైపు చరణ్‌కు ఉన్న ఇంటెన్సిటీ ఈ ఇద్దరిలో ఎవరితో ఆదిత్య ధర్ ముందుగా సినిమా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆదిత్య ధర్ తన కథలను అత్యున్నత సాంకేతిక విలువల తో తెరకెక్కిస్తారు. కాబట్టి బన్నీ అయినా? చరణ్ అయినా ? ఆ సినిమా రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం ఆదిత్య ధర్ `ధురందర్`2 విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుండటంతో? ఆయన తదుపరి అడుగుపై దేశవ్యాప్తంగా క్యూరియాసిటీ నెలకొంది. ఆయన ద‌ర్శ‌క‌త్వంలో నటించడానికి బాలీవుడ్ హీరోలు కూడా పోటీ పడుతున్నప్పటికీ సౌత్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మెగా హీరోలలో ఒకరితో ముందుగా ప్రాజెక్ట్ ఓకే చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హీరోలిద్ద‌రి విష‌యం లోనూ అదిత్య ధ‌ర్ అంతే పాజిటివ్ గా క‌నిపిస్తున్నాడు. సాధార‌ణంగా పెద్ద హిట్ ఇచ్చిన త‌ర్వాత సొంత భాష‌లోనే సొంత హీరోల్ని డైరెక్ట్ చేసుకుని వాళ్ల‌నే హైలైట్ చేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు చూస్తారు. కానీ ఆదిత్య ద‌ర్ మాత్రం అందుకు మిన‌హాయింపుగా క‌నిపిస్తున్నాడు. ఆయ‌న సినిమా క‌థ‌ల్లాగే? భార‌తీయులంతా ఒక్క‌టే ఏ భాష‌లో సినిమా చేస్తే ఏంటి? అన్న దోర‌ణి క‌నిపిస్తుంది.

Tags:    

Similar News