40 వ‌చ్చినా పెళ్లి కాని ప్ర‌సాదులు అమీర్ ఖాన్‌ను చూసి అయినా నేర్చుకోండి!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్ట్` అమీర్ ఖాన్ మూడో వివాహం చేసుకున్నార‌నే వార్త‌ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Update: 2026-07-05 19:30 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ `మిస్టర్ పర్ఫెక్ట్` అమీర్ ఖాన్ మూడో వివాహం చేసుకున్నార‌నే వార్త‌ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బెంగ‌ళూరు యువ‌తి గౌరీ స్ప్రట్ తో త‌న పెళ్లి ఖాయ‌మైంద‌ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించి, ఈ జూలై 5న వివాహానికి రెడీ అయిన ఈ త‌రుణంలో నెటిజ‌నుల్లో దీనిపై బిగ్ డిబేట్ న‌డుస్తోంది. 60 ప్ల‌స్ వ‌య‌సులో అమీర్ ఖాన్ మూడో వివాహానికి సిద్ధ‌మ‌వ్వ‌డంతో రెడిట్ కామెంట్స్, స్క్రీన్‌షాట్లు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలోని పాలి హిల్ నివాసంలో అత్యంత ప్రైవేట్‌గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ కామెంట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ వయసుపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో ఉన్న ఆయన మూడో పెళ్లి చేసుకోవడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలామందికి 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కావట్లేదు..కానీ ఈయన మాత్రం 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి పీటలు ఎక్కేశారు! అంటూ కొందరు పెళ్లికాని ప్రసాదులు తమ ఆవేదనను సరదాగా షేర్ చేసుకుంటున్నారు.

మరికొందరు నెటిజన్లు అమీర్ ఖాన్ పెళ్లిని మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్యాచిల‌ర్షిప్‌తో పోలుస్తూ జోకులు పేలుస్తున్నారు. ``అక్కడ పాపం సల్మాన్ ఖాన్‌కు ఇప్పటివరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు.. కానీ అమీర్ ఖాన్ మాత్రం ఇక్కడ మూడో పెళ్లితో హాట్రిక్ కొట్టేశారు`` అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అలాగే అమీర్ ఖాన్ పెద్ద కుమారుడు జునైద్ ఖాన్‌కు ఇప్పటికే 33 ఏళ్లు పైనే ఉన్నాయని.. కొడుకు పెళ్లి వయసులో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని కొందరు విమర్శనాత్మకంగా స్పందిస్తున్నారు.

అయితే అమీర్ ఖాన్‌కు తన మాజీ భార్యలు ఇద్దరితోనూ (రీనా దత్తా, కిరణ్ రావు) ఇప్పటికీ మంచి స్నేహసంబంధాలు ఉండటంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సింపుల్ వెడ్డింగ్‌కు వారిద్దరూ కూడా హాజరయ్యారనే టాక్ నడుస్తుండటంతో...బహుశా వాళ్లిద్దరే స్వయంగా వచ్చి అమీర్‌ను కొత్త భార్యకు అప్పగించి ఉంటారు! అని ఒక నెటిజన్ చమత్కరించారు. డబ్బున్నవాళ్లు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోగలరని...సమాజం గురించి ఆలోచించి ఏడ్చేది కేవలం మిడిల్ క్లాస్ వాళ్లేనని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి అమీర్ ఖాన్ `గౌరీ` అనే పేరున్న మహిళను పెళ్లి చేసుకోవడంతో బాలీవుడ్ గాసిప్ ప్రియులకు ఒక కొత్త టాపిక్ దొరికింది. ``ఇన్నాళ్లూ బాలీవుడ్‌లో కేవలం ఒకే ఒక్క గౌరీ ఖాన్ (షాారుఖ్ ఖాన్ భార్య) ఉండేవారు.. కానీ ఇప్పుడు మరొక గౌరీ ఖాన్ వచ్చేశారు`` అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా.. అత్యంత ఆత్మీయుల మధ్య జరిగిన ఈ `మిస్టర్ పర్ఫెక్ట్` వివాహ ముచ్చట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక పెళ్ల‌యింది గ‌నుక అమీర్ ఖాన్ న‌టుడిగా త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల‌పై అయినా దృష్టి సారించాల‌ని చాలామంది ఫ్యాన్స్ బ‌లంగా కోరుకుంటున్నారు!

Tags:    

Similar News