అమీర్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఏం చేస్తున్నట్లు?
పర్సనల్ లైఫ్‌లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ రీసెంట్‌గా ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు. జులై 5న గౌరీ స్ప్రాట్‌ను ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పర్సనల్ లైఫ్‌లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ రీసెంట్‌గా ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు. జులై 5న గౌరీ స్ప్రాట్‌ను ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి హడావుడి పూర్తి కావడంతో, ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయన సినిమాల మీద పడింది. స్క్రీన్ మీద హీరోగా అమీర్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ ఇటు ఫ్యాన్స్ తో పాటు అటు ఇండస్ట్రీలో కూడా మొదలైంది.
ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లల్కార్. ఈ ప్రాజెక్ట్ కోసం సీనియర్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్‌తో అమీర్ ఖాన్ చేతులు కలుపుతున్నాడని గట్టిగా టాక్ అయితే వస్తోంది. లెజెండరీ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ జీవితం ఆధారంగా ఒక పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. డెవలప్‌మెంట్ లో ఉందనే బజ్ మాత్రమే నడుస్తోంది.
ఈ కాంబినేషన్ అనగానే జనాలకు వెంటనే గుర్తొచ్చే బ్లాక్ బస్టర్ సినిమా 'లగాన్'. ఆ సినిమా వచ్చి అప్పుడే పాతికేళ్లు పూర్తయింది. ఇన్నేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అమీర్, అశుతోష్ మళ్లీ కలవడం ఇందులో ఒక ఎట్రాక్షన్. పైగా ఈసారి కూడా వీళ్లు ఎంచుకున్నది క్రికెట్ ప్లస్ పీరియడ్ ఇండియా బ్యాక్‌డ్రాప్ ఉన్న కథే కావడం ఇక్కడ మెయిన్ కనెక్షన్. పీరియడ్ సెటప్, క్రికెట్ అనగానే దీన్ని మరో 'లగాన్' అనుకుంటే పొరపాటే. ఇది కంప్లీట్ గా మరో సెటప్. ఆ సినిమా బ్రిటీష్ కాలం నాటి పన్నుల నేపథ్యంలో దర్శకుడు అల్లిన ఒక ప్యూర్ కల్పిత కథ.
కానీ 'లల్కార్' అలా కాదు. ఇది లాలా అమర్‌నాథ్ రియల్ లైఫ్ జర్నీని బేస్ చేసుకుని తీస్తున్న బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డ్రామా అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. డైరెక్టర్, హీరో కాంబో, ఆ సెటప్ మినహా ఈ రెండు సినిమాలకు పోలిక లేదు. ఈ మూవీతో పాటు అమీర్ ఫ్యూచర్ లైనప్ లో మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి. 'త్రీ ఇడియట్స్' సీక్వెల్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని గతంలో కన్ఫర్మ్ చేశాడు. అలాగే తన లాంగ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్' వర్క్ గురించి కూడా గతంలోనే మాట్లాడాడు.
అయితే ఇవి రెండు ఇప్పుడే వెంటనే సెట్స్ పైకి వెళ్లే సినిమాలు కాదు. భవిష్యత్తులో చేయబోయే ప్లాన్స్. పర్సనల్ లైఫ్ లో పెళ్లి చాప్టర్ పూర్తి కావడంతో, ఇక యాక్టింగ్ మీదే అమీర్ పూర్తిగా ఫోకస్ పెట్టనున్నాడు. త్రీ ఇడియట్స్ సీక్వెల్, మహాభారత్ ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్నా, ఇమ్మీడియట్ లీడ్ ప్రాజెక్ట్‌గా అశుతోష్ గోవారికర్ సినిమానే బలంగా వినిపిస్తోంది. లాలా అమర్‌నాథ్ బయోపిక్ ను గనక అఫీషియల్ గా లాక్ చేస్తే పాతికేళ్ల తర్వాత అమీర్ ఖాన్ మళ్ళీ బ్యాట్ పట్టాల్సిందే.