‘శంబాల’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?.. ఆది హీరోగా కొత్త సినిమా ప్రారంభం!
బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టిన ‘శంబాల’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. యంగ్ హీరో ఆది సాయికుమార్ షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మరో వినూత్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు.
బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టిన ‘శంబాల’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. యంగ్ హీరో ఆది సాయికుమార్ షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మరో వినూత్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి భయం, ఉత్కంఠకు తోడు అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఒక సరికొత్త హారర్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ వివరాలేంటో చూద్దాం..
మళ్లీ కలిసిన హిట్ టీమ్:
ఇక ‘శంబాల’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఇప్పుడు ఆదితో రెండో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇక యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. గత సినిమా ఇచ్చిన బూస్ట్‌తో, ఈసారి మరింత పకడ్బందీగా, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి టీమ్ మొత్తం రెడీ అయిపోయింది.
పోస్టర్‌తోనే పుట్టించిన ఉత్కంఠ:
ఈ కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండగా.. రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, పాతకాలం నాటి స్టాంప్ వంటి ఎలిమెంట్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చూస్తుంటే ఈసారి ఆది మనల్ని ఏదో తెలియని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా కనిపిస్తున్నాడు.
భయం.. భక్తి.. ఎమోషన్స్:
ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం హారర్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఇక ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతున్నామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. హారర్ ఎలిమెంట్స్‌ని సరికొత్త కోణంలో చూపించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం.
మ్యూజిక్కే మెయిన్ అస్సెట్:
ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. అందుకే వినూత్నమైన మ్యూజిక్ అందించే శ్రీ చరణ్ పాకాలని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇక ఆయన తన సరికొత్త సౌండ్ డిజైనింగ్‌తో సీటు అంచున కూర్చోబెట్టే బీజీఎం ఇవ్వబోతున్నారట. నిశ్శబ్దంలో కూడా భయాన్ని కలిగించేలా మ్యూజిక్ ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
ఇక గత ఏడాది వచ్చిన శంబాల మంచి సక్సెస్ అందుకొని ఆదిని మరో మెట్టు ఎక్కించింది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆది సాయికుమార్‌కు ‘శంబాల’ తర్వాత ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం కానుంది. కొత్త దర్శకుడు అనుభవం ఉన్న టెక్నీషియన్లతో వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రానున్నాయి. ఆల్ ది బెస్ట్ ఆది..