Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... టీ20 వరల్డ్ కప్ టీం ఇండియా జట్టు ఇదే!

అనంతరం... ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టంతా టీ20 ప్రపంచ కప్ పైనే నెలకొందని భావించాలి.

By:  Tupaki Desk   |   30 April 2024 10:53 AM GMT
బిగ్ బ్రేకింగ్... టీ20 వరల్డ్ కప్ టీం ఇండియా జట్టు ఇదే!
X

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... జూన్ 2 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నమెంట్ కోసం జట్టు ఎంపిక పై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మరోపక్క మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అనంతరం... ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టంతా టీ20 ప్రపంచ కప్ పైనే నెలకొందని భావించాలి.

అవును... జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. ఈ సారి టీ20 ప్రపంచ కప్‌ కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌ లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది.

ఇదే క్రమంలో... ఈ టోర్నమెంట్ లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ను జూన్‌ 5న ఐర్లాండ్‌ తో ఆడనుంది. ఈ టోర్నీలో "గ్రూప్‌ - ఏ"లో ఉన్న భారత్‌ - పాక్‌ జట్లు న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆసక్తి సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌ లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.

ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ లో మొత్తం 55 మ్యచ్ లు జరగనుండగా... అందులో అమెరికాలో 3, వెస్టిండీస్‌ లో 6 వేదికల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే... ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 29న జరగనుంది.

టీ20 ప్రపంచకప్‌ నకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌)

యశస్వి జైస్వాల్

విరాట్ కోహ్లీ

సూర్యకుమార్ యాదవ్

రిషభ్‌ పంత్

సంజూ శాంసన్

హార్దిక్ పాండ్య

శివమ్ దూబె

రవీంద్ర జడేజా

అక్షర్ పటేల్

కుల్దీప్ యాదవ్

యుజ్వేంద్ర చాహల్

అర్ష్‌ దీప్‌ సింగ్

జస్ ప్రీత్ బుమ్రా

మహమ్మద్ సిరాజ్

ట్రావెలింగ్ రిజర్వ్‌:

శుభ్‌ మన్ గిల్

రింకు సింగ్

ఖలీల్ అహ్మద్‌

అవేశ్‌ ఖాన్‌