Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా... కారణం క్లియర్!!

మొత్తం 20 జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్ కోసం టీఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ!

By:  Tupaki Desk   |   1 May 2024 1:30 PM GMT
టీ20 వరల్డ్ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా... కారణం క్లియర్!!
X

ప్రస్తుతం ఐపీఎల్ జోష్ లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కి ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే.. మరో భారీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది! జూన్ 2 నుంచి మొదలవ్వబోయే ఈ తీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం జట్టు ఎంపిక పై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మొత్తం 20 జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్ కోసం టీఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ! దీంతో... జట్టు కూర్పుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి!

టీ20 వరల్డ్ కప్ - 2024 కోసం టీం ఇండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. ఈ సమయంలో జట్టంతా కుర్రాళ్లతో నిండిపోద్దని చాలామంది భావించిన నేపథ్యంలో... సీనియారిటీకే సెలక్షన్ కమిటీ ఓటు వేసింది. ఇందులో భాగంగా... 2022 టీ20 ప్రపంచకప్‌ లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం లభించింది.

వీరిలో రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, అర్ష్‌ దీప్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో... వరల్డ్ కప్ పోరుకు ఎంపికైనవారిలో ఇద్దరు ముగ్గురు మినహా అంతా ఫామ్‌ లో ఉండటం సానుకూలాంశమనే చెప్పాలి. ఈ సమయంలో... హార్ధిక్ పాండ్యా ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవును... ఐపీఎల్ సీజన్ 17 స్టార్ట్ అయిన తర్వాత అత్యంత హాట్ టాపిక్ గా మారాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు ఆ అవకాశం ఇవ్వడం రచ్చ రచ్చగా మారింది. ఈ క్రమంలో... రోహిత్ ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొంతమంది హార్దిక్ ని ట్రోల్ చేయడం, ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు!

అదే కారణమో ఏమో కానీ... ఈ ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదనే చెప్పాలి! కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో... ఈ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన ఎంఐ జట్టు కేవలం మూడింట మాత్రమే గెలిచింది. దీంతో... ఈ ఎఫెక్ట్ అంతా పాండ్యాపైనే పడింది!

దీంతో... ఈ సమయంలో టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ కు అవకాశం కష్టమనే కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టులో హార్దిక్ కు అవకాశం దక్కింది. ఇప్పుడు అంత ఫాం లో లేకపోయినా పాండ్యాకు అవకాశం కల్పించడానికి ఒక బలమైన కారణం ఉందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ లో ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా తీసుకుంటే రాబోయే ప్రపంచ కప్ లో కెప్టెన్ గా అనుభవం సంపాదించుకుంటాడనే ఉద్దేశ్యంతోనే ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.