Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్ కోసం కల్కి అశ్వత్థామ స్పెషల్ వీడియో..!

త్వరలో టీ20 వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో టీం ఇండియాకు స్ఫూర్తి నింపేలా ఒక స్పెషల్ వీడియో సిద్ధం చేశారు

By:  Tupaki Desk   |   2 May 2024 10:18 AM GMT
టీ20 వరల్డ్ కప్ కోసం కల్కి అశ్వత్థామ స్పెషల్ వీడియో..!
X

త్వరలో టీ20 వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో టీం ఇండియాకు స్ఫూర్తి నింపేలా ఒక స్పెషల్ వీడియో సిద్ధం చేశారు. ఈ వీడియోలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ వేషంలో కనిపించి టీం ఇండియా ప్లేయర్స్ ని ఉత్సాహపరిచారు.. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నారు. ఈమధ్యనే సినిమాకు సంబంధించి అమితాబ్ టీజర్ రిలీజైంది. అశ్వత్థామ లుక్ లో అమితాబ్ సర్ ప్రైజ్ చేశారు.

ఇక ఇప్పుడు అదే స్టిల్ తో టీ 20 వరల్డ్ కప్ ఆడబోతున్న టీం ఇండియా సభ్యులను ఉద్దేశించి ఒక స్పెషల్ వీడియో చేశారు. ఇది మహా యుద్ధం.. గొప్ప పోరాటం.. ధైర్యంగా ఉండండి.. విజయం ముందు మీరు తలవంచొద్దు.. మీ సామర్ధ్యాలను ప్రదర్శించండి. బలాన్ని చూపించండి. ప్రతి తల్లి గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలో కళ్లు పెట్టి చూడండి అప్పుడే దేశం కోసం మీరు సిద్ధమవుతారు అంటూ బిగ్ బీ అమితాబ్ అశ్వత్థామ లుక్ తో చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

అమితాబ్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీ 20 వరల్డ్ కప్ కోసం దాని ప్రమోషన్ కోసం ఒక వీడియో చేయమని అడిగితే కల్కి టీం తో మాట్లాడి అశ్వత్థామ లుక్ తో ఈ వీడియో చేయడం ప్రత్యేకంగా నిలిచింది. అశ్వత్థామ లుక్ తో అమితాబ్ బచ్చన్ స్కీన్ పై ఒక మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తుంది.

టీం ఇండియాకు స్పూర్తిని ఇవ్వడమే కాదు అశ్వత్థామ లుక్ తో కల్కి 2898 ADకి పమోషన్స్ కూడా చేసున్నారు కల్కి టీం. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇయర్ రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీస్ లో మొదటిగా కల్కి ఉంటుంది. ఈ సినిమా ను జూన్ 27న రిలీజ్ లాక్ చేశారు.

అమితాబ్ టీజర్ తో కల్కి పై అంచనాలు డబుల్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె నటిస్తుండగా దిశా పటాని ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. కమల్ హాసన్ కూడా కల్కి లో ఒక సర్ ప్రైజ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ఇన్నాళ్లు టైం తీసుకుని కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మరి సినిమా ప్రమోషన్ కంటెంట్ అదిరిపోగా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.