Begin typing your search above and press return to search.

కొండంత కుటుంబం... అయినా అండలేని చెల్లెమ్మ...!?

ప్రత్యక్ష ఎన్నికల్లో వారు నిలుచుంటే అవతల వారికి గెలుపు సందేహం అన్నది కచ్చితంగా చెప్పే మాట.

By:  Tupaki Desk   |   10 May 2024 3:40 AM GMT
కొండంత కుటుంబం... అయినా అండలేని చెల్లెమ్మ...!?
X

కడప జిల్లా పులివెందులలో ఆ ఇంటిపేరు ఒక బ్రాండ్. అదే వైఎస్ అన్నది. అది గత మూడు తరాలుగా ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే రాజకీయంగా అర్ధ శతాబ్ద కాలంగా మారుమోగుతున్న పేరు. వైఎస్సార్ ఇంటి నుంచి ఎవరు పోటీ చేసినా ఓటమి ఉండదు. ప్రత్యక్ష ఎన్నికల్లో వారు నిలుచుంటే అవతల వారికి గెలుపు సందేహం అన్నది కచ్చితంగా చెప్పే మాట.

మరి ఆ ఇంటి ఆడపడుచు. ఒక దివంగత ముఖ్యమంత్రి కుమార్తె. మరో ముఖ్యమంత్రి చెల్లెలు అయిన షర్మిలకు ఇపుడు పులివెందులలో రాజకీయంగా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇబ్బందికరంగా అని చెబుతారు. వైఎస్సార్ కుటుంబం మొత్తం జనాభా సింపుల్ గా చెప్పుకుంటే ఏడు వందల యాభై మంది పై దాటి అని చెబుతారు. వారంతా బంధువులు.

ఇక సన్నిహితులు, స్నేహితులు, దూరపు చుట్టాలు పరిచయస్తులు ఇలా తీసుకుంటే వేలల్లో ఉంటారు. మరి ఇంతటి పెద్ద కుటుంబం కొండంత కుటుంబం నుంచి షర్మిలకు రాజకీయంగా అండ ఎంతమేరకు దొరుకుతోంది అంటే సమాధానం పెద్దగా లేదు అని. ఆమె ఒక విధంగా చూస్తే ఒంటరి పోరాటమే చేస్తున్నారు అని అంటున్నారు.

వైఎస్ షర్మిల కడప నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీలో ఉన్నారు. తన తరఫున పోలింగ్ ఏజెంట్లను ఆమె నియమించుకునేందుకు కూడా బంధువుల నుంచి తగిన సహకారాలు దక్కడం లేదు అని ప్రచారం గా ఉంది. సొంత బంధువులే ఆమెను దూరం పెడుతున్నారని టాక్ ఉంది.

ఆమె పులివెందులలో పర్యటించినపుడు అలాగే కడపలో తిరిగినపుడు కూడా సన్నిహితులు అయిన వారు బంధువులు ఎవరూ దగ్గరకు రాకపోవడాన్ని కూడా అంతా చూస్తున్నారు అని అంటున్నారు. వైఎస్ జగన్ సీఎం గా ఉన్నారు. ఆయనతో అందరినీ నేరుగా పరిచయాలు ఉన్నాయి. ఉపకారాలు కూడా పొందిన వారు ఉన్నారు.

ఇక షర్మిల విషయమే తీసుకుంటే ఆమె జగన్ ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. సొంత అన్నతో విభేదించిన తరువాత ఆమెకు కడప కానీ పులివెందుల కానీ సరికొత్త అనుభవాలను చూపిస్తోంది అని అంటున్నారు.ఒకనాడు ఆమె కడపకు వస్తే నీరాజనాలు పట్టిన బంధుగణం సన్నిహిత జనం ఇపుడు ఆమెను పూర్తిగా దూరం పెట్టేశారు అని అంటున్నారు.

వైఎస్సార్ కుటుంబీకుల మద్దతు కూడా షర్మిలకు దక్కడం లేదు అని అంటున్నారు. దీంతో షర్మిల ఒక విధంగా షాక్ తిన్నారని అంటున్నారు. తన వారు అనుకున్న వారు దూరం కావడంతో ఆమె ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు. గతంలో తనతో ఉండే బంధువులు కూడా ఈసారి ముఖం తిప్పుకుని పక్కకు పోవడం అంటే ఆమెని పూర్తిగా బాధించే అంశమే అని అంటున్నారు.

దానికి కారణం షర్మిల ఎంచుకున్న రాజకీయ పంధా అని అంటున్నారు. షర్మిల వైఎస్సార్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ ఏపీకి సీఎం గా ఉన్న జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శించడాన్ని తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. వైఎస్ కుటుంబంలో ఈ చీలికలు కలతలు ఏమిటి అని చాలా మంది ఆవేదన చెందుతున్నారని అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదాలు ఏమి ఉన్నా షర్మిల ఇలా జగన్ ని బాహాటంగా విమర్శించడాన్ని మాత్రం వారు తట్టుకోలేకనే ఆమెను దూరం పెడుతున్నారు అని అంటున్నారు.

ఇక కడపలో కానీ పులివెందులలో కానీ జగన్ అన్న మాటే వేదం. ఆయన నియమించిన మనుషులతో అయిన వారి అందరికీ పనులు సాఫీగా సాగుతాయి. అదే షర్మిలని నమ్ముకుంటే ఆమె గెలిచినా ఓడినా హైదరాబాద్ లో ఉంటారని అందుకే ఆమెతో ఎందుకు అని చాలా మంది సన్నిహితులు దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు.

మరి కొందరు అయితే ఆమెతో మాట్లాడితే ఎక్కడ జగన్ కి తెలిసి ఆయన ఆగ్రహానికి గురి అవుతామని భయపడి కూడా ఆమెను దూరం పెడుతున్నారు అని అంటున్నారు. ఇక వైఎస్ షర్మిల కడప ఎంపీగా నామినేషన్ వేసినపుడు కూడా సాదాసీదా కార్యక్రమంగానే సాగింది.ఆమె వెంట వైఎస్సార్ కుటుంబీకులు ఎవరూ లేరు అని అంటున్నారు.

ఆఖరుకు షర్మిల ఎంపీ నామినేషన్ పత్రాల మీద సంతకాలకు కూడా బంధువులు నిరాకరించారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇక ఎన్నికల వేళ తనకు ప్రధాన ఏజెంట్ గా ఉండాలని షర్మిల నేరుగా తమ కుటుంబంలోని ఒక కీలక వ్యక్తిని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించడం కూడా ప్రచారంగా ఉంది. ఈ ఒక్క సంఘటల్తో కడపకు పులివెందులకు షర్మిల పూర్తిగా దూరం అయిందని రుజువు అయిందని అంటున్నారు.