Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోటీశ్వరులై ఉండాలా?

ఎన్నికల్లో ధనవంతులే పోటీ చేస్తున్నారు. డబ్బున్న వారిదే పలుకుబడి ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 May 2024 7:44 AM GMT
ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోటీశ్వరులై ఉండాలా?
X

ఎన్నికల్లో ధనవంతులే పోటీ చేస్తున్నారు. డబ్బున్న వారిదే పలుకుబడి ఉంటుంది. వారు ఏది చెబితే అది చెల్లుబాటు అవుతుంది. వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందమే. అదే వెంట్రుకలు లేకపోతే కొప్పు వేయడానికే వీలు పడదు. అలా డబ్బున్న వారిదే ఆధిపత్యం నడుస్తుంది. అందుకే ఎన్నికల్లో కోటీశ్వరులకే టికెట్ దక్కుతుంది. వారే పోటీలో నిలదొక్కుకుని విజయం సాధించడం కామనే.

మనదేశంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ధనవంతులదే కీలక పాత్ర. బాగా డబ్బున్న వారే ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు పంచి విజయం సాధిస్తారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మంది ధనవంతులే ఉండటం దీనికి తార్కాణం. దక్షిణ గోవా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లవి శ్రీనివాస్ డెంపో రూ. 1361 కోట్ల ఆస్తులతో మూడో దశ ఎన్నికల్లో అత్యంత ధనవంతురాలిగా రికార్డు సాధించింది.

రెండో స్థానంలో గుణ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్ సింధియా రూ. 424 కోట్లతో ఉన్నారు. ఇక మూడో స్థానంలో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి షాహూ రూ. 342 కోట్లతో నిలిచారు. మనదేశంలో మూడు దశల్లో 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో 392 మంది కోటీశ్వరులే కావడం గమనార్హం. ఇలా చూస్తే మన దేశంలో పేదరికం ఎక్కడుంది అనే ప్రశ్న కూడా రావచ్చు.

మనదేశం అత్యంత కోటీశ్వరులున్న పేద దేశం. సంపద కొందరి చేతిలోనే ఉంటుంది. ఉన్నవాడు ఉన్నవాడిగానే ఎదుగుతాడు. లేనివాడు మాత్రం పేదరికంలోనే మగ్గుతాడు. ఇది మన దేశ దౌర్భాగ్యం. సంపద కొందరి చేతుల్లోనే ఉంటుంది. దీని వల్ల ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి. డబ్బు అందరికి సమానంగా ఉండదు. తిండి కూడా సమానంగా దొరకదు.

దేశంలో కోటీశ్వరులైతేనే ఏదైనా చేయొచ్చు. డబ్బు లేని వాడు ఏం చేయడానికి ఉండదు. అందుకే ఎన్నికల్లో ధనవంతులే చక్రం తిప్పుతారు. వారే అధికారంలోకి వస్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఇంత మంది ధనవంతులు పోటీలో నిలవడం గమనార్హం. ఈనేపథ్యంలో డబ్బుతోనే అన్ని పనులు జరుగుతాయని మనకు తెలిసిందే కదా.