Begin typing your search above and press return to search.

రాత్రి వేళ చెవిరెడ్డి హైడ్రామా.. ఇంటి నుంచి బయటకు వచ్చేశారు!

కార్యకర్తలు.. మద్దతుదారులు.. సానుభూతిపరులు రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   16 May 2024 7:38 AM GMT
రాత్రి వేళ చెవిరెడ్డి హైడ్రామా.. ఇంటి నుంచి బయటకు వచ్చేశారు!
X

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా చోటు చేసుకున్న ఘటనలు షాకిచ్చేలా మారాయి. కార్యకర్తలు.. మద్దతుదారులు.. సానుభూతిపరులు రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న చెవిరెడ్డి స్థాయి నేత సైతం ఇలా చేయటమా? అని విస్మయానికి గురవుతున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హౌస్ అరెస్టు చేయటం తెలిసిందే. దీంతో.. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. నిబంధనలు ఇలా ఉంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించారు. బుదవారం రాత్రి చెవిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయటాన్ని తప్పు పడుతున్నారు. పోలీసుల ఆదేశాల్ని ఉల్లంఘించినట్లుగా అభివర్ణిస్తున్నారు. బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. తన కొడుకు మోహిత్ రెడ్డిని వెంట పెట్టుకొని స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లటాన్ని ప్రశ్నిస్తున్నారు.

అయితే.. ఇంటి నుంచి కొడుకుతో కలిసి బయటకు వచ్చిన ఆయన.. స్ట్రాంగ్ రూంలోకి మాత్రమే చెవిరెడ్డి కుమారుడు వెళ్లారు. ఆ టైంలో చెవిరెడ్డి కారులోనే కూర్చొని ఉన్నారు. చెవిరెడ్డి ఎపిసోడ్ గురించి తెలిసిన వారంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. చెవిరెడ్డిని.. ఆయన కుమారుడ్ని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. పోలీస్ స్టేషన్ వద్దకు చెవిరెడ్డి చేరుకొని.. వాహనం దిగి స్టేషన్ లోకి వెళ్లే సమయానికే వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద చేరుకొన్నారు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో స్పందించిన పోలీసులు.. తమతో తీసుకొచ్చిన చెవిరెడ్డిని.. ఆయన కుమారుడ్ని ఇంటికవ వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. హౌస్ అరెస్టులో ఉన్న చెవిరెడ్డి ఇంటి నుంచి బయటకు ఎలా వస్తారు? అన్నదిప్పడు ప్రశ్నగా మారింది. దీనిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఉత్కంటగా మారింది.