Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త రాజకీయం : ప్రత్యర్ధి మీడియా చానళ్ళ బ్యాన్ !

తమ గురించి ఎక్కువగా చెప్పని లేక తమ తప్పులను ఎత్తి చూపే మీడియా చానళ్ళకు ప్రత్యర్థులుగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 May 2024 4:44 AM GMT
ఏపీలో కొత్త రాజకీయం : ప్రత్యర్ధి మీడియా చానళ్ళ బ్యాన్  !
X

తమ గురించి ఎక్కువగా చెప్పని లేక తమ తప్పులను ఎత్తి చూపే మీడియా చానళ్ళకు ప్రత్యర్థులుగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దాంతో ఆయా చానళ్ళ మీద విరుచుకుపడుతున్నాయి. రాజకీయం పీక్స్ కి చేరితే ఇంతే మరి అన్నట్లుగా ఉంది. ఏపీలో టీడీపీకి అనుకూల చానళ్ళు అంటే ఈటీవీ ఏబీఎన్ టీవీ 5, మహా టీవీ అని చెబుతారు. ఇక వైసీపీకి సొంతంగా సాక్షి ఉంది. అలాగే ఎన్టీవీ టీవీ 9 కూడా ఎంతో కొంత మద్దతుగా ఉంటున్నాయని ప్రచారంలో ఉంది.

ఇదే ఇపుడు ఆ చానళ్ళ మీద బ్యాన్ కి కారణం అవుతోందిట. ఎటూ సాక్షి చానల్ డిబేట్ కి టీడీపీ ప్రతినిధులు రారు. ఇపుడు ఎన్టీవీ టీవీ 9 చానళ్ల మీడియా డిబేట్ కి కూడా వెళ్ళవద్దు అని ఆదేశాలు టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది అని ప్రచారం సాగుతోంది.

నిజంగా ఇది బాధాకరమే అంటున్నారు. రాజకీయం కాస్తా ఎక్కడికో వెళ్ళి ఆఖరుకు మీడియా చానళ్ల మధ్య బ్యాన్ కి దారి తీయడం అంటే ఆలోచించాలని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎన్టీవీ టీవీ 9లకు మంచి ఆదరణ ఉంది. న్యూట్రల్ పీపుల్ కూడా వీటిని వీక్షిస్తారు. ఇపుడు టీడీపీ అధినాయకత్వం ఈ చానళ్ళను బ్యాన్ అంటూ తీసుకున్న నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని అంటున్నారు.

అదే టైంలో వైసీపీ అయితే టీడీపీ అనుకూల మీడియా చానళ్ళకు ఎపుడో బ్యాన్ చేసేసింది. ఇలా వార్ కాస్తా జగన్ చంద్రబాబుల నుంచి మీడియా చానళ్ళ దాకా పోతోంది.ఇది ఎంతవరకూ వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంది. నువ్వా నేనా అంటూ సాగే రాజకీయ పోరులో మిగిలిన వ్యవస్థలు కూడా అవస్థ పడుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది.

అదే టైం లో ఇది మంచి విధానం కాదు అని కూడా అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మీడియా ప్రభావం రాజకీయంగా పడడం, రాజకీయ ప్రభావం మీడియా మీద పడి వాటికి పార్టీల రంగులు అద్దడం అన్నది ఒక్క ఏపీలోనే చూస్తున్నామని అంటున్నారు.

రెండు పార్టీలు రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులు ఇలా దశాబ్దాలుగా ఏపీలో రాజకీయం సాగుతోంది అని అంటునారు. అది అలా కంటిన్యూ అవుతోందని తరం మరి కొత్త తరానికి బదిలీ అవుతోందని ఫలితంగా మరింతగా పదును తేరి ప్రజాస్వామ్య పోకడలనే అపహాస్యం చేసే తీరుగా సాగుతోందని అంటున్నారు.

అయితే ఇపుడు మరో విషయం కూడా చెప్పుకోవాలి. బహుశా అదే జనాలకు మేలు చేస్తూ చేరువ అవుతోంది అని కూడా భావించాలి. యూట్యూబ్ చానల్స్ సోషల్ మీడియ వెబ్ మీడియాను ఇపుడు జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు. వాటికి విశ్వసనీత పెరిగింది. వాటి మీదనే అందరి దృష్టి పడుతోంది. అచ్చమైన నిజాలు చెప్పేవిగా కూడా సోషల్ మీడియా వేదికగా సాగే చానల్స్ కి ఇతర మీడియా సంస్థలకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటున్నారు.