Begin typing your search above and press return to search.

బెట్టింగులో రూ. 2 కోట్లు పోగొట్టడంతో కడతేర్చిన తండ్రి

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత పల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొడుకు తండ్రి మాట వినకుండా జల్సాలు, బెట్టింగులకు పాల్పడి ఉన్న భూమిని అమ్మేశాడు.

By:  Tupaki Desk   |   12 May 2024 8:31 AM GMT
బెట్టింగులో రూ. 2 కోట్లు పోగొట్టడంతో కడతేర్చిన తండ్రి
X

ఇటీవల కాలంలో చాలా మంది జల్సాలకు అలవాటు పడుతున్నారు. సరదాగా ఆటలాడుతూ జీవితాలనే శిథిలం చేసుకుంటున్నారు. ఆన్ లైన్ బెట్టింగుల పేరుతో రూ. కోట్లుపోగొట్టుకుంటున్నారు. దీంతో కుటుంబం కకావికలంగా మారుతోంది. బెట్టింగులకు అలవాటు పడి ఉన్న ఆస్తినంతా అమ్మేసుకుంటున్నారు. వద్దని వారించినా వినకుండా దారి తప్పుతున్నారు. ఫలితంగా ప్రాణాలే తీసుకుంటున్నారు.

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత పల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొడుకు తండ్రి మాట వినకుండా జల్సాలు, బెట్టింగులకు పాల్పడి ఉన్న భూమిని అమ్మేశాడు. ఇందులో సుమారు రూ. 2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. అయినా అతడి తీరు మారలేదు. ఇప్పటికైనా మారాలని తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఆ తండ్రే తనయుడిని హతమార్చాడు.

ముకేష్ కుమార్ (28)అనే వ్యక్తి బెట్టింగులకు ఆకర్షితుడయ్యాడు. దీంతో తండ్రి సత్యనారాయణ ఆ పని మానుకోవాలని సర్ది చెప్పాడు. అయినా వినిపించుకోలేదు. ఇంతవరకు సంపాదించిన ఆస్తిని అమ్మి అప్పులు చెల్లించాడు. అయినా అతడిలో మార్పు లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో కోపోద్రిక్తుడైన తండ్రి కుమారుడిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.

తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ప్రాణాలు వదిలాడు. ముకేష్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొడుకు బెట్టింగ్ ల కారణంగా మేడ్చల్ లో ఇల్లు, ప్లాట్లు అమ్మేశాడు. హతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్న తండ్రి కాలయముడిలా మారడం గమనార్హం.

ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జల్సాలకు అలవాటు పడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. దీంతో కన్న వారికి కోపం వచ్చి క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ కొడుకు తండ్రి మాట వినకపోవడంతోనే అతడిని హతమార్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి వారి వారసుడిని వారే కడతేర్చడం బాధాకరం.