Begin typing your search above and press return to search.

అత్యధికం భువనగిరి .. అత్యల్పం హైదరాబాద్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదయింది.

By:  Tupaki Desk   |   15 May 2024 9:18 AM GMT
అత్యధికం భువనగిరి .. అత్యల్పం హైదరాబాద్
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదయింది. ఎన్నికల కమీషన్ ఫైనల్ ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది. సరళి పై పూర్తిస్థాయి కసరత్తు చేసిన ఎలక్షన్ కమిషన్ తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకుగాను 65.67% నమోదయింది. 2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మూడు శాతం ఓటింగ్ అధికంగా నమోదు అయినట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 32 లక్షల 16 వేల మంది ఓటర్లు ఉండగా, రెండు కోట్ల 20 లక్షల 24 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెండు కోట్ల 20 లక్షల 24 వేల ఓటర్లలో రెండు కోట్ల 18 లక్షల 14 వేల మంది 35వేల పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మిగిలిన రెండు లక్షల పదివేల మంది పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎన్నికల కమీషన్ తెలిపింది. ఈ రెండు లక్షల పదివేల మందిలో 1,89,000 మంది ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, 21,680 మంది వృద్ధులు ఇంటి వద్ద ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. అత్యధికంగా భువనగిరి పార్లమెంటు స్థానంలో 76.78 శాతం నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 48.48 శాతం నమోదు అయింది. ఎక్కడా చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు నమోదుకాలేదని స్పష్టం చేసింది.